రేవంత్ సెట్ చేసిన డిఫరెంట్ డ్రెస్ కోడ్

మనకు కనబడుతున్నపొలిటీషియన్లకు రేవంత్ రెడ్డి భిన్నంగా కనబడుతున్నారు. ఏ విషయంలో అంటే డ్రెస్ విషయంలోనే.

Update: 2024-08-07 08:22 GMT

మనదేశంలో మామూలుగా పొలిటీషియన్ అనగానే ముందుగా జనాలకు గుర్తుకొచ్చేది ఖద్దర్ డ్రెస్సే. ఖద్దర్ బట్టలకు రాజకీయ నేతలకు విడదీయరాని బంధముందన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఖద్దర్ బట్ట కట్టిన నేతలంటే జనాలకు ఉన్న గౌరవమే వేరు. మరిపుడు ఖద్దర్ బట్టలు వేసుకుంటున్ననేతలపై జనాల్లో అలాంటి గౌరవం ఉందా ?



ఇపుడు విషయం ఏమిటంటే మనం చూసిన, మనకు కనబడుతున్నపొలిటీషియన్లకు రేవంత్ రెడ్డి భిన్నంగా కనబడుతున్నారు. ఏ విషయంలో అంటే డ్రెస్ విషయంలోనే. అందరిలాగే రేవంత్ కూడా ఖద్దర్ బట్ట వేసుకుంటారు కాని అది రెగ్యులర్ గా మాత్రం కాదు. అందులోను ఖద్దర్ అంటే రేవంత్ వేసుకునేది చొక్కా మాత్రమే. మామూలుగా చాలామంది పొలిటీషియన్లు ప్యాంట్, చొక్కా రెండు ఖద్దరే వేసుకుంటారు. కాని రేవంత్ మాత్రం చొక్కా మాత్రమే ఖద్దర్ వేసుకుంటారు. అదికూడా రోజూ వేసుకోరు. ఖద్దర్ తో పాటు ఖద్దర్ లోనే ఫైనెస్ట్ ఫ్యాబ్రిక్ అయిన లినెన్, టెరికాటన్, కాటన్ చొక్కాలు వేసుకుంటారు. ప్యాంట్ మాత్రం కాటన్ లేదా టెరికాటన్ వేసుకుంటారు. వీటికన్నా ముఖ్యంగా రేవంత్ కు బాగా పాపులారిటి తెచ్చింది మాత్రం జీన్స్ అనే చెప్పాలి. జీన్స్+టీషర్టుల్లో ఎక్కువగా కనబడే సీఎం బహుశా రేవంత్ ఒక్కరేనేమో.



 రేవంత్ తరచూ జీన్స్ ప్యాంట్లలోనే ఎక్కువగా కనబడుతుంటారు. ఈ విషయంలోనే రేవంత్ మిగిలిన రాజకీయనేతలకన్నా భిన్నంగా కనబడుతుంటారు. ఇపుడు గమనించాల్సింది ఏమిటంటే విదేశీ పర్యటనల్లో ఉన్నపుడు కూడా రేవంత్ ఎక్కువగా జీన్స్ ప్యాంట్లు, టీషర్టుల్లోనే కనబడుతున్నారు. ఇండియాలో సీఎంలు ఎలాగున్నా విదేశీ పర్యటనల్లో మాత్రం ఎక్కువమంది సూట్ లోనే కనబడుతారు. నరేంద్రమోడి దేశంలో ఉన్నపుడు కుర్తీల్లోనే కనబడుతారు. కుర్తీలు కూడా ఖద్దరువే వేసుకుంటారు. ఎందుకంటే ఖద్దరును మోడి బాగా ఇష్టపడతారు. దేశంలో మోడిని ఖద్దర్ బట్టలకు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ ఖద్దర్ బట్టలను వాడమని మోడి బాగా ప్రమోట్ చేస్తున్నారు.



 దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రెగ్యులర్ గా ఖద్దర్ పంచ, చొక్కాల్లోనే కనబడతారు. విదేశీ పర్యటనల్లో సూట్ వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక చంద్రబాబునాయుడు దేశంలో అయినా, విదేశాల్లో అయినా ఖద్దర్ ప్యాంట్, షర్ట్ లోనే ఉంటారు. కేసీఆర్ ఖద్దర్ బట్టలతో పాటు విదేశాల్లో సూట్ కూడా వేసుకున్న సందర్భాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఖద్దర్ కు దూరమనే చెప్పాలి. దేశంలో అయినా విదేశాల్లో అయినా మామూలుగా కాటన్ ప్యాంట్, కాటన్ లేదా టెరికాటన్ షర్టులోనే ఉంటారు. ఇపుడు రేవంత్ మాత్రం జీన్స్ ప్యాంట్, షర్టులోనే కనబడుతున్నారు. ఇతర నేతలకన్నా భిన్నంగా కనబడాలని కోరుకునే రేవంత్ డ్రస్ కోడ్ విషయంలో మాత్రం భిన్నత్వాన్ని కనబరుస్తున్నారు.



 పెట్టుబడుల టార్గెట్ తో అమెరికాలో రేవంత్ బిజీగా ఉంటున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ లో అనేకమంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. కాగ్నిజెంట్, ట్రైజిన్, ఆర్పీసీఎం తదితర ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ అయి పెట్టుబడులకు ఒప్పించారు. ఒప్పందాల సమయంలో కూడా తనకిష్టమైన జీన్స్ నే వేసుకున్నారు. అమెరికా పర్యటన తర్వాత రేవంత్ దక్షిణకొరియాలో రెండు రోజులు పర్యటించి ఆగష్టు 14వ తేదీకి హైదరాబాద్ చేరుకుంటారు.

Tags:    

Similar News