నక్షాతో భూవివాదాల పరిష్కారం

పైలెట్‌ ప్రాజెక్టు కింద దేశంలోని 152 మున్సిపాలిటీలలో భూ సర్వే చేస్తారని మంత్రి నారాయణ చెప్పారు.;

Update: 2025-05-16 12:37 GMT

పట్టణాలలో పారదర్శకంగా సమర్థవంతమైన పాలన అందించడం కోసం, రెవెన్యూ రికార్డుల అమలు, భూవివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన నక్షా కార్యక్రమాన్ని ఏపీలో నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయరణ పేర్కొన్నారు.

ల్యాండ్‌ రికార్డ్స్‌ డిజిటలైజేషన్‌ పై గుంటూరులో శుక్రవారం జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ నిర్వహించారు. దీనిలో మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. పట్టణాల్లో భూ వివాదాలు తగ్గించి రెవెన్యూ రికార్డులను పక్కాగా అమలు చేయడం కోసం కేంద్రం నక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పైలట్‌ ప్రాజెక్ట్‌గా 152 మున్సిపాలిటీలను ఎంపిక చేసి భూముల సర్వే చేపట్టింది. నక్ష పైలట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 10 మున్సిపాలిటీలు కేంద్రం ఎంపిక చేసింది. ఈ మున్సిపాలిటీలలో 524 చ.కిమీ. విస్తీర్ణంలో 9.5 లక్షల ఆస్తుల సర్వే చేసి డిజిటలైజేషన్‌ చేయనున్నారు.
ఇప్పటికే 8 మున్సిపాలిటీల్లో ఏరియల్‌ సర్వే పూర్తి అయ్యాయి. ఏలూరు, మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లలో కొనసాగుతోంది. నక్షా కార్యక్రమం పూర్తైన తర్వాత పట్టణాల ప్రణాళిక, పన్నుల విధానం, ఆస్తుల వివాదాల పరిష్కారానికి ఉపయోగపడనుంది. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు తెలిపారు. వికసిత్‌ భారత్‌ 2047 ద్వారా దేశ అభివృద్ధి, స్వర్ణాంధ్ర విజన్‌–2047 ద్వారా రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ వర్క్‌షాపు కార్యాక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు హాజరయ్యారు.
Tags:    

Similar News