మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట

అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించిన సుప్రీంకోర్టు;

Update: 2025-07-02 07:49 GMT

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 15 రోజుల పాటు ఊరట లభించింది. మొత్తం 11 కేసులలో ఒక్కొటొక్కటిగా బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల అవడానికి మార్గం సుగమమైంది.అక్రమమైనింగ్ కేసులో వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ ఈ నెల 17 కు వాయిదా పడింది.దాంతో ప్రస్తుతానికి వంశీ బెయిల్ పై విడుదల కానున్నారు.

వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈరోజు (బుధవారం) ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగింది.అక్రమ మైనింగ్ చేసి వంశీ రూ 196 కోట్లు దోపిడీ చేశారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.అయితే ఆ అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో తమకు అందజేయాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను ఈనెల 17కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.దాంతో వల్లభినేని వంశీకి స్వల్ప ఊరట దక్కినట్లయ్యింది.
గన్నవరం ప్రైవేటు స్ధల వివాదం కేసులోనూ వంశీకి ఊరట లభించింది.ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ సీతామహాలక్ష్మి దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చడాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు బెయిల్ రద్దుకు నిరాకరించింది.
Tags:    

Similar News