మద్యం కేసులో రికవరీ చట్టం తేవాలి

3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అయితే,ప్రధాన లబ్ధిదారుడు జగనే అంటూ యనమల కీలక వ్యాఖ్యలు;

Update: 2025-07-21 09:10 GMT

ఏపీ మద్యం కేసులో అరెస్టులు ,కీలక విచారణ సాగుతున్న వేళ టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి యనమల రామకృష్ఠుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలని లేకుంటే కొత్త చట్టం తీసుకురావాలని సూచించారు. ఆర్థిక నేరస్థుడు హత్య చేసిన వ్యక్తి కంటే చాలా ప్రమాదకరమని సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిందని గుర్తు చేశారు.కుంభకోణంలో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అయితే,ప్రధాన లబ్ధిదారుడు జగనే అని యనమల అన్నారు. జగన్ నేతృత్వంలో చాలా మంది ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మింగేసి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అమరావతిలో యనమల మీడియాతో మాట్లాడారు.ప్రజలను మోసం చేసిన వారిని న్యాయ విచారణతో పాటు ప్రజాకోర్టులోకి తీసుకురావాలని సూచించారు.తప్పుడు మార్గాన్ని అనుసరించే వాళ్లు,శిక్ష నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని ఎన్నికల్లో ప్రజలే మరోమారు బుద్ది చెబుతారని అన్నారు.

Tags:    

Similar News