ఆ భూములపై ఎలాంటి విచారణకైనా సిద్ధం: ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకమన్నారు. అవసరమైతే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు.

By :  Admin
Update: 2024-10-24 06:19 GMT

దస్పల్లా, ఎన్‌సీసీ భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదని, వీటిపైన ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమని, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా తను ఎటువంటి అభ్యంతరం లేదని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా ఆయన గురువారం విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో వైఎస్‌సీపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు. అవసరమైతే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వెల్లడించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు. డయేరియా బాధితులను వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శిస్తారని, డయేరియాతో 14 మంది మరణించారని విజయసాయిరెడ్డి చెప్పారు.


Tags:    

Similar News