Electoral bonds to BRS|ఫార్ములా కార్ రేసు అవినీతిలో కొత్త సంచలనం
ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race) కేసులో కీలకంగా ఉన్న గ్రీన్ కో కంపెనీ(Green Ko Company) నుండి క్విడ్ ప్రోకో నుండి బీఆర్ఎస్ కు 41 కోట్లు అందింది.;
ఫార్ములా ఈ కార్ రేసు అవినీతిలో మరో కొత్త సంచలనం బయటపడింది. ఈ కొత్త సంచలనాన్ని స్వయంగా తెలంగాణా ప్రభుత్వమే బయటపెట్టింది. ఇంతకీ కొత్త సంచలనం ఏమిటంటే ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race) కేసులో కీలకంగా ఉన్న గ్రీన్ కో కంపెనీ(Green Ko Company) నుండి క్విడ్ ప్రోకో నుండి బీఆర్ఎస్ కు 41 కోట్లు అందింది. ఈ మొత్తం క్యాష్ రూపంలో కాకుండా ఎలొక్టరోల్ బాండ్లు, పార్టీకి చందాల రూపంలో బీఆర్ఎస్(BRS) అందుకున్నట్లుగా ప్రభుత్వం ఆరోపించింది. పార్టీకి ఎన్నికల బాండ్ల(Electoral Bonds) రూపంలో గ్రీన్ కో కంపెనీ రు. 49 కోట్లు చెల్లించిందని ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్ధలు 41 సార్లు పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ప్రకటించింది. రేసుకు సంబంధించిన చర్చలు మొదలైనప్పటినుండి ఒక్కోటి కోటిరూపాయలు విలువచేసే ఎలక్టోరల్ బాండ్లు గ్రీన్ కో చెల్లించింది. 2022, ఏప్రిల్ 8వ తేదీనుండి అక్టోబర్ 10వ తేదీమధ్య కంపెనీ నుండి బీఆర్ఎస్ పార్టీకి బాండ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ప్రభుత్వం బయటపెట్టిన వివరాలన్నీ బూటకమే అని కేటీఆర్(KTR) కొట్టిపారేశారు. ఎలక్టోరల్ బాండ్లు తీసుకోవటంలో తప్పేముందన్నారు. ఇదే గ్రీన్ కంపెనీ నుండి కాంగ్రెస్, బీజేపీలు కూడా బాండ్ల రూపంలో విరాళాలు తీసుకున్నట్లు చెప్పారు. కేంద్రఎన్నికలకమీషన్ అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లను తీసుకోవటం తప్పు ఎలాగవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. మొన్నటివరకు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో అసలు అవినీతే లేదని చాలాసార్లు చెప్పారు. కేసంతా కుట్రపూరితమే అని కొట్టిపారేశారు. అలాంటిది ఇపుడు ఎలక్టోబరల్ బాండ్లు తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. అసలు గ్రీన్ కో కంపెనీ నుండి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు రావాల్సిన అవసరం ఏమిటన్న విషయాన్ని మాత్రం కేటీఆర్ చెప్పటంలేదు. ఏ కంపెనీ అయినా లాభంలేనిదే పార్టీలకు విరాళాలు ఇవ్వవని అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు విరాళాలు ఇస్తే ఏదో రాజకీయపార్టీ కాబట్టి విరాళమిచ్చిందని అనుకోవాలి. అదే అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఇచ్చిందంటే కచ్చితంగా ఏదో లాభంలేనిదే ఏ కంపెనీ కూడా ఇవ్వదు.
అందులోను కోట్లరూపాయల విరాళం ఇచ్చిందంటే కచ్చితంగా తెరవెనుక ఒప్పందంలో భాగంగానే విరాళాలు అందినట్లు ఎవరికైనా అనుమానాలు వచ్చేస్తాయి. అందులోను కోట్లాదిరూపాయల విరాళాలిచ్చిన కంపెనీకి అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కాంట్రాక్టులిచ్చి ఒప్పందం చేసుకున్నది అంటే అందులో కచ్చితంగా క్విడ్ ప్రోకో జరిగిందని ఎవరికైనా అర్ధమైపోతుంది. ఇపుడు ప్రభుత్వం బయటపెట్టిన ఎలక్టరోల్ బాండ్ల విరాళాల వివరాలతో బీఆర్ఎస్-గ్రీన్ కో కంపెనీ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్న విషయం తెలిసిపోయింది. దీనిపైన కేటీఆర్ ఎంత సమర్ధించుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు.