సత్యసాయి ప్రజల్లోనే దేవుడి చూశారు.. సేవలే ఆయనను దేవుడిని చేశాయి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పుట్టపర్తికి పోటెత్తిన ప్రముఖులు

Update: 2025-11-23 09:34 GMT
పుట్టపర్తిలో బంగారు రథంపై సత్యసాయిబాబా చిత్రపటానికి ఊరేగిస్తున్న సాయి భక్తులు

సత్య రధం... సాయి రధం... ప్రేమ రథం... శాంతి రథం... అని సింగర్ మను సంగీత సాహిత్యానికి అనుగుణంగా భగవాన్ శ్రీసత్యసాయి స్వర్ణరథం కదిలింది.


సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తికి ప్రముఖుల తాకిడి ఎక్కువైంది. సత్యాసాయి జయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది సత్యసాయి సమాధిని దర్శించుకున్న తీరువాత ఆయన హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సభలో మాట్లాడారు.

Full View

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో ఆదివారం పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియం కళకళలాడింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, సాయి విద్య సంస్థల విద్యార్థులు, దేశంలోని ప్రముఖులతో నిండిపోయింది. పుట్టపర్తితో పాటు హిల్ వ్యూ స్టేడియంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.


భారత ఉపరాష్ట్రపతి సీపీ. రాధాకృష్ణన్ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏ. రేవంత్ రెడ్డి, ఎన్. చంద్రబాబునాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, సెలబ్రీటీల్లో సాయి సంకీర్తనలతో ప్రముఖ నేపథ్య గాయకుడు మనో, డ్రమ్స్ శివమణి సంగీత విభావరి అలరించింది.

సాయినామ సంకీర్తనలు, అన్ని రాష్ట్రాల శ్రీసాయిభక్త బృంద ప్రదర్శనల మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది.

పుట్టపర్తికి ఆదివారం ఉదయం చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి విమానాశ్రయంలో మంత్రులు, అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు.

ఆ తరువాత ఆయన ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సాయికుల్వంత్ హాలులోని సత్యసాయి మహాసమాధిని దర్శంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలహారం సమర్పించారు.

ప్రజల మనసులు గెలిచిన బాబా
"సత్యసాయిబాబా ప్రజల్లోనే దేవుడిని చూశారు. ప్రేమతో వారి మనసులు గెలుచుకున్నారు" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ విషయంలో అయినా సరే ప్రేమ ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందనే బాబా సందేశం యుగయుగాల పాటు ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా సాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సత్యసాయి సేవా కార్యక్రమాలను విస్తరించడం, సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ చేరవేయడానికి ప్రభుత్వం తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
సేవలతో ప్రజల్లో దేవుడైన బాబా
ప్రభుత్వాలు చేయలేని చోట సత్యసాయి ట్రస్ట్ చేపట్టిన సేవలు లక్షలాది మంది జీవనం సాఫీగా సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో బాబా చేసిన సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడం ద్వారా బాబా ట్రస్ట్ లక్షలాది మంది జీవితాలను వెలుగులోకి తెచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వాలకు సరితూగే స్థాయిలో, మరిన్ని సందర్భాల్లో వాటికి మించి సేవలను ట్రస్ట్ అందిస్తోందని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
“మానవ సేవే మాధవ సేవ” అనే బాబా సిద్ధాంతం కేవలం బోధనే కాదు. నమ్మకంగా, అమల్లోనూ నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ ఎల్లలు దాటిన సత్యసాయి సందేశం 140 దేశాలకు బాబా సేవలు విస్తరించడమే" అని ఆయన గుర్తు చేశారు.
సాయి మాటలే.. జ్ణాన సందేశం

సత్యసాయి ప్రతిపాదించిన అంశాలు, మాటలతోనే ప్రపంచానికి జ్ణాన సందేశం ఇచ్చారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు.
“ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవనప్రయాణంలో భగవాన్ సాయి సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు. సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు“ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన భావాలు వ్యక్తం చేశారు.
ప్రశాంతి నిలయానికి 75 సంవత్సరాలు
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో మరో విశిష్టతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం నిర్మించి ఆదివారం నాటికి 75 ఏళ్లు నిండాయని హర్షధ్వానాల మధ్య చెప్పారు.
“మనుషుల రూపంలో దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. శ్రీసతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్వ్.హెల్ప్ ఎవర్, హర్ట నెవర్“ అనే సత్యసాయి ప్రబోధనలు అందరీకి శిరోధార్యం అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఎవరూ పిలవకున్నా వారంతట వారే వచ్చి, బాబా సిద్ధాంతాన్ని పాటిస్తున్నారనీ, డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని ప్రశాంతత పుట్టపర్తిలో ఆస్వాదిస్తున్నారన్నారు. సత్యసాయి స్ఫూర్తి అజరామజరమనీ, ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్ గా అభివర్ణించారు.
జీవన ప్రమాణాలు పెంచారు..

రాయలసీమలో అనంతపురం వంటి వెనుకబడిన ప్రాంతాలకు తాగునీటి ప్రాజెక్టులు అందించడం ద్వారా సత్యసాయిబాబా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి గుర్తుచేశారు. బాబా చేయి అందిన ప్రతి ప్రాజెక్ట్ ప్రజల మౌలిక అవసరాలను తీర్చడానికే అంకితం అయ్యిందని వివరించారు. మానవ విలువల వికాసానికి భగవాన్ సత్య సాయి బాబా చేసిన సేవలు అపూర్వమని అన్నారు.
“భగవాన్ సత్య సాయి బాబా మాటలతో ప్రేరణ పొందార. దీంతో అభివృద్ధి చెందిన గ్లోబల్ సేవా ఉద్యమం ప్రపంచంలో కోట్లాది మందిని సేవా భావంతో ఐక్యం చేసింది. వడ్రంగి నుంచి సీఈఓ వరకు, పాట్నా నుంచి పెరూ వరకు, గుజరాత్ నుంచి కెనడా వరకు.. ఒకే సేవా ధ్యేయంతో ముందుకెళ్తున్న మిలియన్‌కి పైగా సాయిసేవాదారులను సాయి బాబా బోధనలు ఒకే తాడు మీద కట్టేశాయి“ అని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి భావోద్వేగంగా అన్నారు.
రత్నాకర్ జ్నాపకాల దొంతర
భగవాన్ శ్రీసత్య సాయి బాబా తనకు వ్యక్తిగతంగా బోధించిన అనేక లోతైన పాఠాలను సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ భక్తుల మధ్య స్మరించుకున్నారు. తన జీవితం, సేవ మార్గాన్ని ఎలా తీర్చిదిద్దడానికి ప్రేరణ కలిగించిన సంఘటనలను యాత్రికులతో పంచుకున్నారు. భగవాన్ సత్యసాయి స్వయంగా ఇచ్చిన సందేశాన్ని ఆయన ఉటంకించారు.
“సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు ఉందని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉందా? మంచి పని చేస్తే అది తనంతట తానే ప్రకాశిస్తుంది” అనే సత్యసాయి మాటలను ఆయన గుర్తు చేశారు.
భగవాన్‌ శాశ్వత సన్నిధిని పునరుద్ఘాటిస్తూ, స్వామి మిషన్‌ నిత్యం సజీవంగా, విస్తారంగా కొనసాగుతోందని, భక్తులు ప్రతి క్షణం సత్యసాయి మార్గదర్శకత్వాన్ని, రక్షణను అనుభవిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.
“గంగా నదిలో మునిగి స్నానం చేయడం వల్ల గంగా నదిని మనం పవిత్రం చేయడం లేదు. మనల్ని మనం పునీతుల్ని చేసుకుంటున్నాం. గంగానది లాగ శ్రీసత్య సాయి సేవా సంస్థలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. సత్యసాయి సేవా సంస్థల్లో చేరడం, సేవ చేయడంలో ప్రతి ఒక్కరు తమని తాము పునీతులుగా చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది“ అనే సత్యసాయి మాటలను ఆర్జె. రత్నాకర్ గుర్తు చేశారు.
Tags:    

Similar News