ఏపీలో పదోన్నతుల పండుగ
14 మంది పోలీసు అధికారులకు ఎస్సీలుగాను, నలుగురు అదనపు న్యాయమూర్తులకు పదోన్నతులు లభించాయి.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవత్రం పర్వదినం రోజున ఆంధ్రప్రదేశ్‌లో పదోన్నతుల పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని 14 మంది పోలీసు అధికారులకు ఎస్పీలుగా పదోన్నతి లభించగా, నలుగురు అదనపు న్యాయమూర్తులకు పదోన్నతులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్న జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లకు పూర్తి స్థాయి జడ్జిలుగా పదోన్నతులను కల్పించారు. ఆ మేరకు కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా ఆరు రాష్ట్రాల్లోని 16 మంది హైకోర్టు జడ్జిలకు పదోన్నతులు కల్పించాల్సిందిగా సుప్రీం కోర్టు కొలీజియం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అనంతరం కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.