ప్రధాని గారూ–నాకు డిగ్రీ లేదని సిగ్గుపడటం లేదు

సోషల్‌ మీడియా వేదికగా ప్రకాష్‌ రాజ్‌ స్పందించారు.;

Update: 2025-08-27 13:58 GMT

ప్రధాని గారూ.. నాకు డిగ్రీ లేదు. నాకు డిగ్రీలేదని చెప్పుకోవడానికి సిగ్డుపటం లేదు..పైగా ఆ విషయాన్ని దాచుకోవడం లేదు.. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ విలక్షణ నటుడు, బహు భాషా కోవిదుడు ప్రకాష్‌ రాజ్‌ పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చదువు, క్వాలిఫికేషన్‌ అంశాలు తెరపైకి రావడంతో ప్రకాష్‌ రాజ్‌ తనదైన శైలిలో స్పందించారు.

ప్రధాని మోదీ విద్యార్హతల మీద నెలకొన్న వివాదంపైన స్పందించిన ఢిల్లీ హైకోర్టు ప్రధాని మోదీ బీఏ డిగ్రీకి సంబందించిన వివరాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని సోమవారం నాడు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రకాష్‌రాజ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.
ప్రకాష్‌ రాజ్‌ ఏమన్నారంటే..
భారత దేశ ప్రజలు, భారత ప్రధాన మంత్రిని అడ్రస్‌ చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. నా పేరు ప్రకాష్‌ రాజ్‌.. నేను డిగ్రీ హోల్డర్‌ను కాదు. నా క్రియేటివ్‌ కెరీర్‌ కోసం నా డిగ్రీ చదువుని మధ్యలోనే డిస్‌కంటిన్యూ చేశాను. దీని కోసం నేనేమీ సిగ్గుపడటం లేదు. అంతేకాకుండా.. నాకు డిగ్రీ లేదనే విషయాన్ని దాచిపెట్టాలని కూడా అనుకోవడం లేదు.. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ట్వీటర్‌ వేదికగా ప్రకాష్‌ రాజ్‌ పేర్కొన్నారు.


Tags:    

Similar News