పవన్‌ అమ్ముకున్నదేంటి? ప్రకాష్‌రాజ్‌ ‘ఛీ..ఛీ’ అని ఎందుకన్నారు?

మిత్రుడు పవన్‌ కల్యాణ్‌పై ప్రకాష్‌రాజ్‌ మరో సారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.;

Update: 2025-07-12 06:16 GMT

ప్రముఖ విలక్షణ నటుడు, బహుభాషా కోవిధుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్‌రాజ్‌ తన మిత్రుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై మరో సారి తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాలలో ఇద్దరు కలిసి నటించడంతో పాటు నిజ జీవితంలో కూడా మంచి స్నేహితులుగా ఇద్దరికి పేరున్నా.. రాజకీయ అంశాలు ఇద్దరి మధ్య ఒపీనియన్‌ డిఫరెన్స్‌ వచ్చింది. గ్యాప్‌ పెరిగింది. సోషల్‌ మీడియా వేదికగా ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రకాష్‌రాజ్‌ మరో సారి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హిందీ భాష మీద శుక్రవారం వపన్‌ కల్యాణ్‌ మాట్లాడిన మాటలను ఉద్దేశించి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా .... ఛీ.. ఛీ అని పేర్కొంటూ జస్ట్‌ ఆస్కింగ్‌ అని ట్వీట్‌ చేశారు. హిందీ భాష గురించి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన వీడియోను షేర్‌ చేశారు.
ఇద్దరు మంచి స్నేహితులైనప్పటికీ ఇటీవల గత కొంత కాలంగా రాజకీయ పరంగా పవన్‌ కల్యాణ్‌ తీసుకుంటున్న స్టాండ్‌ను, పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న మాటలను ప్రకాష్‌ రాజ్‌కు మింగుడు పడటం లేదు. ప్రజాస్వామ్యానికి, దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, ఈ రకమైన ధోరణి మంచి కాదని పవన్‌ కల్యాణ్‌ను ప్రకాష్‌రాజ్‌ ప్రశ్నిస్తూ వస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో మాట్లాడిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిగా ఆయన మాటలు, చేష్టలకు మధ్య పొంతన లేక పోవడంతో ఈ రకమైన ధోరణి మంచిది కాదనే ఉద్దేశంతో పవన్‌ కల్యాణ్‌ను ప్రకాష్‌రాజ్‌ ప్రశ్నిస్తూ వచ్చారు.
తిరుపతి తిరుమల లడ్డూ వివాదాన్ని పవన్‌ కల్యాణ్‌ తీసుకొచ్చిన తీరును ప్రకాష్‌ రాజ్‌ తీవ్రంగానే వ్యతిరేకించారు. దానికి పవన్‌ కల్యాణ్‌ బహిరంగంగానే ప్రకాష్‌రాజ్‌కు బదులిచ్చారు. నాటి నుంచి వారిద్దరి మధ్య సోషల్‌ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్‌ కల్యాణ్‌ హిందీ భాషపై మాట్లాడిన మాటలను ఉద్దేశించి ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా .. ఛీ,, ఛీ అంటూ సింపుల్‌గా ఒక లైన్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ దేనిని అమ్ముకున్నారు? ఎలా అమ్ముకున్నారు? ఎందుకు అమ్ముకున్నారు? వంటి ఎన్నో ప్రశ్నలు ప్రకాష్‌రాజ్‌ మాటల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే హిందీ భాష మీద, దాని ఆధిపత్య తీరు మీద, ఉత్తరాది డామినేటింగ్‌ను హిందీ భాషను వ్యతిరేకిస్తూ పవన్‌ కల్యాణ్‌ గతంలో మాట్లాడిన మాటలు, డిప్యూటీ సీఎం అయ్యాక ప్రస్తుతం సమర్థిస్తూ మాట్లాడుతున్న మాటలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News