‘అంతర్వేది’లో విషపురుగులు

పర్యాటకులపై వాలితే దద్దుర్లు, జిల వస్తున్న వైనం.;

Update: 2025-06-29 07:28 GMT

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో విషపురుగులు మనుషులపై వాలుతున్నాయి. అంతర్వేది ప్రాంతానికి ఎక్కువ మంది పర్యాటకులు వెళుతుంటారు. ఆదివారం కావడంతో కాస్త తాకిడి ఎక్కువగానే ఉంటోంది. సముద్రం ఆటుపోట్ల కారణంగా నీటిలో ఈ జీవులు కొట్టుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు.

ఇసుకలో నుంచి బయటకు వచ్చి మనుషులపై వాలుతున్నాయి. ఆ పురుగు వాలిన ప్రాంతం అంతా దద్దుర్లు (బెందులు), జిల, వాపు వంటివి వస్తున్నాయి. ఈ దురదను భరించలేక వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి స్థానికంగా ఉండే ఆస్పత్రుల వద్దకు వెళ్లి డాక్టర్ లతో సంప్రదించి ఆయిట్ మెంట్, మాత్రలు రాయించుకుని వెళుతున్నారు. ఇప్పటి వరకు ఇటువంటి పురుగులు రాలేదని మత్స్యకారులు చెబుతున్నారు.


అంతర్వేదిలో ఉన్న సముద్ర గట్టున జల్లి ఫిష్ (అగ్గిబాట) అనే పురుగులు ఇసుక లోనుంచి బయటకు వస్తున్నట్లు స్థనికులు చెబుతున్నారు. మనుషులను ఇవి తాకగానే  దురద, మంటలు, దద్దుర్లు వస్తున్నాయి. ప్రమాద జీవి కాదని, కొబ్బరి నూనె రాస్తే ఉపసమనం కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు. సీ డ్రాగన్ ఫిష్ అని పిలుస్తారని మత్యకారులు చెబుతున్నారు. సుమారు పది మందిపై ఇవి వాలినట్లు స్థానికులు చెబుతున్నారు.

అంతర్జాల ప్రాంతాలు (intertidal zones) రోజుకు రెండుసార్లు ఆటుపోట్ల కారణంగా నీటిలో మునిగి ఇసుక దిమ్మెలు ఆ తర్వాత బయట పడుతూ ఉంటాయి. ఈ ప్రాంతాలు విభిన్న జీవవైవిధ్యానికి ఆవాసంగా ఉంటాయి. ఇందులో కొన్ని విషపూరిత లక్షణాలు ఉన్న పురుగులు ఉండే అవకాశం ఉందని బయో డైవర్సిటీ అధికారులు తెలిపారు. అంతర్వేది తీరం, భూమి మధ్య సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్నట్లు వారు తెలిపారు.

కొన్ని సముద్ర సెంటిపెడ్ జాతులు అంతర్జాల ప్రాంతాలలో నివసిస్తాయి. వీటి కాటు విషపూరితమైనది కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇవి మనిపై వాలినా, పాకినా చర్మంపై దద్దుర్లు, వాపు, నొప్పిని వస్తుందని తెలిపారు.

అంతర్జాల ప్రాంతాలలో కొన్ని జెల్లీఫిష్ జాతులు ఆహారం కోసం లేదా రక్షణ కోసం స్టింగర్స్ (nematocysts) ద్వారా విషాన్ని విడుదల చేస్తాయి. శరీరానిని ఈ నీరు తగిలినా దద్దుర్లు, దురద లేదా తీవ్రమైన సందర్భాల్లో అలెర్జీని కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆటుపోట్లు, సముద్ర ఉష్ణోగ్రతలలో మార్పులు, లేదా కాలుష్యం వల్ల కొన్ని విష జాతులు అంతర్వేది వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటున్నట్లు బయో డైవర్సిటీ అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News