తల్లికి స్వల్ప అస్వస్థత- హైదరాబాద్ కు పవన్

క్యాబినెట్ కు హాజరై వెంటనే వెళ్లిపోయిన ఉపముఖ్యమంత్రి;

Update: 2025-06-24 07:36 GMT

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు క్యాబినెట్ సమావేశానికి హాజరై వెనువెంటనే హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. పవన్ తల్లి అంజనా దేవి స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారన్న సమాచారం మేరకే హుటాహుటిన పవన్ మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.రు. ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం ప్రారంభం అవ్వగానే ముఖ్యమంత్రితో పాటు ,ఉపముఖ్యమంత్రి పవన్ కూడా హాజరయ్యారు.అనంతరం క్యాబినెట్ అనుమతి తీసుకొని వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పి పవన్ కళ్యాణ్ అటునుంచి అటే గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు.

Tags:    

Similar News