రొటీన్‌కు భిన్నంగా నిక్కరు, టీషర్టుతో పవన్‌ కల్యాణ్‌

విజయవాడలో ఓ సెలూన్‌ ఓపెనింగ్‌ చేసిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌;

Update: 2025-06-08 12:47 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదివారం డిఫరెంట్‌ లుక్‌లో సండది చేశారు. ఎప్పుడూ వై అండ్‌ వైట్‌ లాల్చీ ఫైజామాలో కనిపించే పవన్‌ కల్యాణ్‌ ఆదివారం అందుకు భిన్నంగా దర్శనమిచ్చారు. రాజకీయ నాయకుడిగా తన వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌ను పక్కన పెట్టి క్యాజువల్‌ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చారు. నిక్కరు, టీషర్టుతో ఆయన ఆశ్చర్యపరిచారు. పొలిటికల్‌ నాయకులతో పాటు అక్కడున్న వారంతా నిక్కరు, టీషర్టులో ఉన్న పవన్‌ కల్యాణ్‌ను చూసి ముక్కున వేలేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ఒక సాధారణ పౌరుడిలాగా సింపుల్‌గా ఉన్నారేంటి అని అక్కడకు వచ్చిన వారంతా చర్చించుకోవడం పరిపాటిగా మారింది.


ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదివారం విజయవాడ నగరంలోని కానూరు ప్రాంతంలో ఒక సెలూన్‌ ఓపెనింగ్‌కు వచ్చారు. నిక్కరు, రౌండ్‌ నెక్‌ టీషర్టు వేసుకొని ‘కొనికి సెలూన్‌’ను ఓపెన్‌ చేసేందుకు వచ్చారు. ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు ఉన్నారు. సింపుల్‌గా నిక్కరు, టీషర్టు వేసుకొని కారులో నుంచి దిగిన పవన్‌ను చూసి యార్లగడ్డతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ కనిపించే వై అండ్‌ వైట్‌ లాల్చీ ఫైజామాతో కారు దిగతారు అని భావించిన వారికి ఇంట్లో వేసుకునే నిక్కరు, టీషర్టుతో దర్శనమివ్వడంతో ముక్కున వేలేసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఇంత సింపుల్‌గా ఉంటారా అంటూ చర్చించుకోవడం వారి వంతైంది. అలా డిఫరెంట్‌ డ్రెస్‌లో వచ్చిన పవన్‌ కల్యాణ్‌ సెలూన్‌ కొనికిని ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌తో దిగిన ఫోటోలను యార్లగడ్డ వెంకట్రావు తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు.




Tags:    

Similar News