మేడే ఉత్సవాల్లో పవన్‌ కల్యాణ్‌

రక్తం దారపోసి పని చేసే వారు లేకపోతే ఏ నిర్మాణం జరగదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.;

Update: 2025-05-01 09:29 GMT

ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాలులో గురువారం నిర్వహించిన మేడే ఉత్సవాలలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ పథకం శ్రామికులతో పవన్‌ కల్యాణ్‌ ముచ్చటించారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి ఒక వెన్నుముకని అన్నారు. దాదాపు 75లక్షల 23వేల మంది శ్రామికులు వారి వారి సొంత గ్రామాల్లోనే ఉంటూ ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారని అన్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో తన శాఖలైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో రూ. 10,699 కోట్లు ఖర్చు చేశామన్నారు. వీటిల్లో కేవలం వేతనాలకే రూ. 6,194 కోట్లు ఖర్చు అయినట్లు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. మెటీరియల్‌ కింద రూ. 4,023 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పల్లెపండుగలో భాగంగా ఇప్పటి వరకు రూ. 377.37 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 21,564 గోకులాలను పూర్తి చేశామన్నారు. వీటి వల్ల ప్రతి రైతుకు నెలకు రూ. 4,200 అదనపు ఆదాయం వస్తోందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రక్తం దారపోసి పని చేసేవారు లేకపోతే ఏ నిర్మాణం కూడా జరగదని, అందువల్ల ఉపాధీ కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలుద్దామని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చిరు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం శ్రామికులను ప్రధానమంత్రి జీవిత బీమా కల్పించినట్లు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం శ్రామికులు ప్రమాద వశాత్తు మరణిస్తే.. వారికి రూ. 2 లక్షల జీవిత బీమా లభిస్తుందని వెల్లడించారు. అదే పని చేసే చోటే ప్రమాదం సంభవించి ఆ ప్రమాధంలో మరిణిస్తే ఇచ్చే నష్ట పరిహారాన్ని రూ. 50వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచినట్లు పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఆ మేరకు ఎస్‌బీఐతో పంచాయతీరాజ్‌ అధికారులు ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.
Tags:    

Similar News