ప్రజలతో మమేకమవుతూ.. సమస్యల పరిష్కారం దిశగా పవన్ అడుగులు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. బాధ్యతలు స్వీకరించి మొదటి రోజు నుంచీ కూడా వీలైనప్పుడల్లా ప్రజలతో మమేకమవుతున్నారు.

Update: 2024-07-29 14:17 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. బాధ్యతలు స్వీకరించి మొదటి రోజు నుంచీ కూడా వీలైనప్పుడల్లా ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం సత్వర చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ యువతి మిస్సింగ్ కేసును 48 గంటల్లో ఛేదించేలా చర్యలు తీసుకున్న విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌డీఏ కూటమి నేతలందరిదీ ఇదే పంథాగా కనిపిస్తోంది. ప్రతి నేత కూడా ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వీరిలో పవన్ కల్యాణ్‌కు వివేష స్పందన వస్తుంది. ఆయన స్వీకరిస్తున్న సమస్యల్లో చాలా వరకు పరిస్కారమవుతున్నాయని జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఈరోజు కూడా మంగళగిరిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన సమస్యల స్వీకరణ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పులలు సంఖ్య పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన గత ప్రభుత్వ బాధితులను స్వయంగా కలిసి వారి వినతులను స్వీకిరంచారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, అధికారులను సమీక్ష నిర్వహించి మీ సమస్యలపై సత్వర చర్యలు తీసుకుంటానని పవన్ కల్యాణ్ ప్రజలకు హామీ కూడా ఇచ్చారు.

పవన్ కల్యాన్‌ను బాధితులు విన్నవించుకున్న కొన్ని సమస్యలు..

కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను తమను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐదుగురు స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలని కోరారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలి అని విజ్ఞప్తి చేశారు.

వైసీపీ నాయకులు తన తండ్రికి చెందిన ఎకరన్నర భూమిని కబ్జా చేయడంతో పాటు సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంకు చెందిన శ్రీమతి కృష్ణవేణి అనే మహిళ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలని కోరారు.

తమ కుమారుడిని తన స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేశారని అయితే పోలీసులు దానిని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి క్లోజ్ చేశారని చోడవరానికి చెందిన శ్రీమతి సోమాదుల కృప అనే మహిళ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరింది.

విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళ పెన్షన్ రావడం లేదని శ్రీ పవన్ కళ్యాణ్ గారి విన్నవించుకున్నారు.

అంతకు ముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయం దగ్గరా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన శ్రీమతి నిమ్మగడ్డ అనురాధ అనే మహిళ స్థానిక పంచాయతీలోని అవకతవకలపై ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని అందించారు. సీనియర్ సిటిజన్స్ తమ సమస్యలను వివరించారు.

Tags:    

Similar News