పీ4 స్వచ్ఛందమే–బలవంతం లేదు

ఏపీ పునర్నిర్మాణం దిశగా ముందడుగు–స్వచ్ఛంద కార్యక్రమంగా పీ4 పథకం ప్రారంభించినట్లు కుటుంబరావు పేర్కొన్నారు.;

Update: 2025-07-28 12:43 GMT

పీ–4 పథకం స్వచ్ఛందమే కానీ ఎవ్వరినీ బలవంతం చేయడం లేదని స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ సి.కుటుంబరావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణానికి దిశానిర్దేశకుడిగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది పర్వదినాన పీ4 (పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్స్‌ పార్ట్నర్‌షిప్‌ ప్రోగ్రాం) ను ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు స్వచ్ఛందంగా అట్టడుగునున్న కుటుంబాలు, వ్యక్తులు, గ్రామాల అభివృద్ధిలో తోడ్పడే అవకాశాన్ని కల్పిస్తోందిని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పీ4 పథకం లక్ష్యం
సమాజంలో ఎవరైతే బాగా ఆర్థికంగా బలంగా ఎదిగారో, వారు అట్టడుగున ఉన్న బడుగు వర్గాలకు సహాయం అందిస్తే అసమానతలు తొలగుతాయి, సమాజంలో సమానత్వం నెలకుంటుంది. ప్రతి ఒక్కరూ వెల్తీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ పౌరులుగా జీవించగలుగుతారు. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించి ఆర్థికంగా,సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించింది.సహాయం చేయగల సామర్థ్యం ఉన్నవారిని మార్గదర్శకులుగా గుర్తించి నమోదు చేసింది. ఈ పథకం పూర్తిగా వాలంటరీ, అంటే స్వచ్ఛందమే.ఎవరూ ఎవరినీ బలవంతంగా ఇందులో చేర్చడం లేదు అని ఆయన స్పష్టం చేశారు.
పీ4 పై ఆరోపణలు అవాస్తవం
ఇటీవల కొన్ని విపక్షాలు, కొంతమంది వ్యక్తులు పీ4 పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డిఇఓ (జిల్లా విద్యాశాఖ అధికారి) హెడ్‌ మాస్టర్లు, టీచర్లను మార్గదర్శకులుగా ఎన్రోల్‌ కావాలని ఫోర్స్‌ చేస్తున్నారనే ఆరోపణలు అవాస్తవం. ఎటువంటి అధికార ఆదేశాలు విడుదల కాలేదు. ఎవరికి ఇష్టమైతే వారు మాత్రమే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమంలో అవాస్తవాలకు తావు ఇవ్వొద్దు. ఎవరైనా బలవంతం చేస్తే, దయచేసి సంబంధిత అధికారులకు లేదా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వగలరు అంటూ ఆయన పేర్కొన్నారు. 
మార్గదర్శకులకు ఆదర్శం సీఎం చంద్రబాబు
ఇప్పటికే 50,000 మందికి పైగా మార్గదర్శకులు స్వచ్ఛందంగా నమోదు అయ్యారు. 6 లక్షల బంగారు కుటుంబాలు గుర్తించబడ్డాయి.మార్గదర్శకులు కూడా వారిని దత్తత తీసుకుంటున్నారు.స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారే 250 కుటుంబాలను దత్తత తీసుకొని పీ4 పథకానికే ఆదర్శంగా నిలిచారు.భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా, ప్రపంచ స్థాయిలో బిలియనర్లు ఎదుగుతున్న దేశంగా గుర్తింపు పొందుతోంది అంతేగాక అధిక శాతం బిలియనర్లు మన దేశస్థులే. అయితే వారితో పాటు అట్టడుగున ఉన్నవారిని ఆర్థికంగా సామాజికంగా మెరుగు పరచాల్సిన బాధ్యత ఆ బిలియనర్ల బాధ్యత. ఇందుకే ప్రభుత్వం వారిని స్వచ్ఛందంగా ఈ పథకంలో భాగం కావాలని కోరుతోంది. అలాగే పీ4 పథకంలో పాల్గొంటున్న అన్ని ప్రభుత్వాధికారులు కూడా దీన్ని వాలంటరీ ప్రోగ్రామ్‌గా మాత్రమే చూడాలని ఎటువంటి బలవంతం లేకుండా పని చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అని సీ కుటుంబరావు స్పష్టం చేశారు.
Tags:    

Similar News