ఓరి నీ పాసుగోల... ఏందయ్యా జగన్!
జగన్ ను కలిసేందుకు కార్యకర్తలకు పాస్ ల జారీపై టీడీపీ నేత లోకేష్ సెటైర్లు;
Byline : G.P Venkateswarlu
Update: 2025-09-02 12:54 GMT
మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలకు పాసులు జారీ చేయడంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ఓరి నీ పాసుగోల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..!’’ అంటూ జగన్ తీరును ఎండగట్టారు.