కొల్లి రఘురామిరెడ్డికి బాబు ట్రీట్‌మెంట్ మొదలైందా..!

ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచే చంద్రబాబు తన మార్క్ నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించేశారు. ఇప్పటికే అందరూ మారిన చంద్రబాబును చూస్తారని చెప్పారు.

Update: 2024-06-07 06:52 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచే చంద్రబాబు తన మార్క్ నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించేశారు. ఇప్పటికే నేతలతో పాటు ప్రజలు కూడా మారిన చంద్రబాబును చూస్తారని ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. ‘‘చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. కానీ ఇకపై అందరూ మారిన చంద్రబాబును చూస్తారు. నిర్ణయాలు, చర్యలు అన్నింటిలో మార్పులు కనిపిస్తాయి. వాటిని ప్రత్యక్షంగా అందరూ చూస్తారు’’ అని సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. అలా చెప్పిన రోజుల వ్యవధిలోనే ఆయనను స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన అధికారులపై కాన్సన్‌ట్రేట్ చేసినట్లు తెలుస్తోంది. సదరు అధికారులకు ఇప్పటికే ఆ సెగ కూడా తగులుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు చంద్రబాబును అరెస్ట్ చేసిన సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డి నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికే ఆయనపై చర్యలు ప్రారంభమయ్యాయని, వాటిలో భాగంగానే ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

బదిలీ వేటు తప్పదా..!

తాజాగా జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి కూడా తాళం పడింది. ఇప్పడు ఆ సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీకావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే రఘురామిరెడ్డిపై బదిలీ వేటు కూడా పడొచ్చని, ఇంకా అవసరం అయితే ఆయనపై కూడా సస్పెన్షన్ వేటు వేసి.. వేబీవీని జగన్ సర్కార్ వేధించిన తరహాలోనే ఐదేళ్ల పాటు పోస్టింగ్ లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఏది ఏమైనా అధికారుల విషయంలో చంద్రబాబు ఆలోచన ఎలా ఉందనేది మాత్రం పార్టీ వర్గాలు కూడా అంచనా వేయలేకున్నాయి. కానీ అధికార బలాన్ని చూసుకుని అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై మాత్రం చర్యలు తప్పక ఉంటాయని, ఆ చర్యలను కూడా ఇష్టారాజ్యంగా కాకుండా చట్ట ప్రకారమే తీసుకుంటామని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

పీఎస్‌ఆర్‌కు ఇదే గతా!

సిట్ చీఫ్ రఘురామిరెడ్డితో పాటు పీఎస్‌ఆర్ ఆంజనేయులపై కూడా అతి త్వరలో చర్యలు తీసుకోవడం ప్రారంభం కావొచ్చని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అందుకు ఆయనను కలవడానికి చంద్రబాబు నిరాకరించడం ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు పీఎస్ఆర్ ఆంజనేయులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే సమయానికల్లా కొత్త సీఎస్, కొత్త డీజీపీ నియామకాలు పూర్తి అవుతాయిన సమాచారం. అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుతుందని కూడా కొందరు చెప్తున్నారు. కానీ మరికొందరు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పని అంటే ఇప్పుడు మీరు చేస్తున్నదేంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ విజయం సాధించినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెట్రేగిపోయాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కాగా అన్నింటిపై చర్యలు ఉంటాయని, ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణం నుంచి రాష్ట్ర శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకుంటానమి కొందరు టీడీపీ నేతలు చెప్తున్నారు.

Tags:    

Similar News