ఎపిలో నో రీ పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్‌ లేదు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్‌ మీనా తెలిపారు.

Update: 2024-05-13 14:56 GMT

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా తెలిపారు. సోమవారం రాత్రి ఏడున్నర గంటలకు మీడియాతో మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో 8, కోడూరు రెండు, దర్శి రెండు పోలింగ్‌ స్టేషన్స్‌లో ఈవీఎంలను అల్లరి మూకలు ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. 275 బియూలు, 217 సీయూలు, 600 వివి ప్యాట్స్‌ల్లో సమస్యలు వచ్చాయని తెలిపారు. తమ వద్ద అదనంగా 20వేల మిషన్స్‌ ఉన్నందున వెంటనే ఆ స్థానాల్లో మార్చి ఓటింగ్‌ జరిపామన్నారు. డ్యామేజ్‌ అయిన మిషన్స్‌లోని 12 చిప్స్‌ను టెక్నికల్‌ ఇంజనీర్లు పరిశీలిస్తే డేటా స్టోర్‌కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని తేలినందున అక్కడ తిరిగి కొంత సమయం తరువాత పోలింగ్‌ ప్రారంభించినట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల సమయానికి 68 శాతం పోలింగ్‌ జరిగిందన్నారు. ఆరు గంటల తరువాత 3,500 పోలింగ్‌ స్టేషన్స్‌లో 100 నుంచి 200 మంది వరకు ఓటర్లు ఉన్నారని, కొన్ని చోట్ల 8గంటలు, మరికొన్ని చోట్ల 10 గంటల వరకు పోలింగ్‌ జరిగే అవకాశం ఉందన్నారు. పోలింగ్‌ పూర్తి అయిన తరువాత మొత్తం పోలింగ్‌ శాతం తెలుస్తుందన్నారు.

కొన్ని చోట్ల గొడవలు జరిగాయి. ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. తెనాలి, అనంతపురం, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన సంఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారన్నారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత సోమవారం తెల్లవారు ఝాము లోపు ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూముల్లోకి తరలించి సీల్‌ వేయడం జరుగుతుందని తెలిపారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద సీఆర్‌పిఎఫ్‌ బలగాలు ఉంటాయని, సీసీ కెమెరాలు అమరుస్తామని, పార్టీల వారు కూడా తమ నుంచి ఒక వ్యక్తిని స్ట్రాంగ్‌ రూముల వద్ద పర్యవేక్షణ కోసం ఉంచవచ్చన్నారు.
కాగా పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, నంద్యాల జిల్లా, తాడిపత్రి సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు, బాంబు దాడులు జరిగాయి. అయితే ఇవన్నీ పోలింగ్‌ కేంద్రాలకు వెలుపల వైపున జరిగినందున పోలింగ్‌కు ఎటువంటి అంతరాయం కలుగలేదు. 88 సంవత్సరా నాగాయమ్మ అనే వృద్ధురాలు బూత్‌లో ఓటు వేసి బయటకు వచ్చి వడదెబ్బకు మృతి చెందారు. చాలా మంది మహిళలు గాలిలేక రూముల్లో చెమటలు పట్టి సొమ్మసిల్లి పడిపోయారు.
సోమవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. విడతల వారీగా ఎన్నికల అధికారులు విడుదల చేసిన పోలింగ్‌ పర్సెంటేజీ ఇలా ఉంది..
ఉదయం 9గంటలకు – 9.21 శాతం
ఉదయం 11 గంటలకు – 23.04 శాతం
మ«ధ్యహ్నాం 1 గంటలకు – 40.26
మధ్యహ్నాం 3 గంటలకు – 55.49 శాతం
సాంత్రయం 5 గంటలకు – 67.99

జిల్లాల వారీగా పోలింగ్‌ సరళిని ఒక సారి పరిశీలిస్తే
1. అల్లూరి సీతారామరాజు జిల్లా – 55.17 శాతం
2. అనకాపల్లి జిల్లా – 65.97 శాతం
3. అనంతపురం జిల్లా – 68.04
4. అన్నమయ్య జిల్లా – 67.63
5. బాపట్ల జిల్లా – 72.14
6. చిత్తూరు జిల్లా – 74.06
7. కోనసీమ జిల్లా – 73.55
8. తూర్పు గోదావరి జిల్లా – 67.93 శాతం
9. ఏలూరు జిల్లా – 71.10 శాతం
10. గుంటూరు జిల్లా – 65.58
11. కాకినాడ జిల్లా – 65.01
12. కృష్ణా జిల్లా – 73.53
13. కర్నూలు జిల్లా – 64.55
14. నంద్యాల జిల్లా – 71.43
15. ఎన్టీఆర్‌ జిల్లా – 67.44
16. పల్నాడు జిల్లా – 69.10
17. పార్వతీపురం జిల్లా – 61.18
18. ప్రకాశం జిల్లా – 71 శాతం
19. నెల్లూరు జిల్లా – 69.95
20. సత్యసాయి జిల్లా – 67.16
21. శ్రీకాకుళం జిల్లా – 67.48
22. తిరుపతి జిల్లా – 65.88
23. విశాఖపట్నం జిల్లా – 57.42
24. విజయనగరం జిల్లా – 68.16
25. పశ్చిమ గోదావరి జిల్లా – 68.98
26. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా – 72.85

25 పార్లమెంట్‌ స్థానాల్లో నమోదైన పోలింగ్‌ వివరాలు
1. కాకినాడ – 65.01
2. అమలాపురం – 73.55
3. రాజమండ్రి – 67.93
4. నర్సాపురం – 68.98
5. ఏలూరు – 71.10
6. శ్రీకాకుళం – 67.10
7. విజయనగరం – 67.74
8. అరకు – 58. 20
9. విశాఖపట్నం – 59.39
10. అనకాపల్లి – 64.14
11. మచిలీపట్నం – 73.53
12. విజయవాడ – 67.44
13. గుంటూరు – 65.58
14. నరసరావుపేట – 69.10
15. బాపట్ల – 72.57
16. ఒంగోలు – 70.44
17. నెల్లూరు – 69.55
18. తిరుపతి – 65.91
19. చిత్తూరు – 75.60
20. రాజంపేట – 68.47
21. కడప – 72.85
22. కర్నూలు – 64.08
23. నంద్యాల – 70.58
24. హిందూపురం – 66.89
25. అనంతపురం – 67.71


Tags:    

Similar News