హైదరాబాద్ ఇక రాత్రంతా కళకళ

అర్ధరాత్రుళ్ళు వరకు షాపింగ్ కాంప్లెక్సులు, బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, మల్టీ పెక్సులు తెరిచి ఉంచుకోవచ్చంటు ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2024-09-25 11:28 GMT

హైదరాబాద్ నగరంలోని జనాలకు ముఖ్యంగా యూత్ కు పెద్ద సమస్య తీరిపోయింది. అదేమిటంటే అర్ధరాత్రుళ్ళు వరకు షాపింగ్ కాంప్లెక్సులు, బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, మల్టీ పెక్సులు తెరిచి ఉంచుకోవచ్చంటు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పోలీసులు ఒక సర్క్యులర్ జారీచేశారు. మామూలుగా అయితే రాత్రి 11 గంటలవరకే చాలా కమర్షియల్ యాక్టివిటీస్ మూతపడిపోవాలి. ఎక్కడో హైటెక్ సిటి, గచ్చీబౌలీ లాంటి ఐటి కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే టిఫిన్ బండ్లు ఉంటాయి. హోటళ్ళు, బార్లు, పబ్బుల్లాంటి అన్నీ రాత్రి 12 గంటలకే క్లోజ్ చేసేయాలి.

ఓల్డ్ సిటీలో అయితే పోలీసులు బలవంతంగానే కమర్షియల్ కాంప్లెక్సులను మూతేయించేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డితో మొత్తుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అర్ధరాత్రుళ్ళు కూడా కమర్షియల్ యాక్టివిటీ చేసుకునేట్లుగా అధికారికంగా ఉత్తర్వులు జారీచేయాలని అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని పదేపదే అడిగారు. అంతకుముందే మల్టీపెక్సులు, బార్లు, పబ్బుల యాజమాన్యాల నుండి ప్రభుత్వంపై ఒత్తిళ్ళు వస్తున్నాయి. అందుకనే అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 1 గంట వరకు అన్నీ రకాల కమర్షియల్ యాక్టివిటీస్ అధికారికంగా తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అధికారంగానే పోలీసులు కూడా సర్క్యులర్ జారీచేశారు కాబట్టి ఇక నుండి బలవంతంగా మూసివేయించటాలు ఉండవు.

మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులను శుక్ర, శని వారాలు మినహా మిగిలిన రోజులు ఉదయం 10 గంటల నుండి అర్ధరాత్రి 12 వరకు తెరిచి ఉంచుకోవచ్చు. శుక్ర, శని వారాల్లో ఉదయం 10 గంటల నుండి అర్ధరాత్రి 1 గంటవరకు తెరిచి ఉంచుకోవచ్చు. హోటళ్ళు, రెస్టారెంట్లు ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి 1 గంటవరకు ఓకే. బేకరీలు, టిఫిన్ సెంటర్లు, దాబాలు, ఐస్ క్రీమ్ షాపులు, కాఫీ షాపులు, పాన్ షాపులు కూడా 1 గంటవరకు తెరిచి ఉంచుకోవచ్చు. అంటే ఇక నుండి హైదరాబాద్ ఉదయం 5 గంటలకే మేల్కొని అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటవరకు కళకళల్లాడుతునే ఉంటుందన్నమాట. అధికారికంగానే అర్ధరాత్రి 1 గంటవరకు అని ప్రభుత్వం ప్రకటించిందంటే దాన్ని వ్యాపారస్తులు మరో రెండు మూడు గంటలు తమిష్టం ప్రకారం పొడిగించుకుంటారని అందరికీ తెలిసిందే.

Tags:    

Similar News