రాజధాని ప్రాంతంలో సిఎస్ సుడిగాలి పర్యటన...

అమరావతి రాజధాని ప్రాంతంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు.

Update: 2024-06-09 12:13 GMT

రాష్ట్ర నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు రోజుల ముందు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం అమరావతి రాజధాని ప్రాంతంలో  సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో సిఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను సిఎస్ పరిశీలిస్తున్నారు. ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయుని పాలెం లోని సిఆర్డిఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. తదుపరి అఖిల భారత సర్వీసు అధికారుల నివాసం సముదాయ భవనాలను, ఎంఎల్ఏల క్వార్టర్లు,ఎపి ఎన్జిఓ లో నివాసం భవనాలు సముదాయాలను సిఎస్ పరిశీలిస్తున్నారు. అనంతరం హైకోర్టు ప్రాంతం తదితర చోట్ల సిఎస్ పరిశీలన చేయనున్నారు. పర్యటనలో సిఎస్ తో పాటు సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్,అదనపు కమీషనర్, ఎస్ఇ తదితర ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన సీఎం కానున్న చంద్రబాబు రివ్యూలో ఆదేశించిన విధంగానే అమరావతిలోని భవనాలను పరిశీలించామని, ముందుగా శంకుస్థాపన ప్రాంతం పరిశీలించి అక్కడి పారిశుధ్యక పనులను పర్యవేక్షించామని సీఎస్ చెప్పారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పలు చోట్లు పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, యుద్దప్రాతిపదికన వాటిని నడిపిస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News