రెండుమూడు రోజుల్లో ఆంధ్రాకి కొత్త చీఫ్ సెక్రెటరీ?

ఆంధ్ర సీఎస్ జవహర్ రెడ్డిపై త్వరలో ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉన్నట్లు సహాచారం. ఆయన అధికార పార్టీకి సహకరిస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆంధ్ర కొత్త సీఎస్ ఎవరో..

Update: 2024-04-11 10:51 GMT
(సంపత్ కుమార్)
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. కొద్ది రోజుల క్రితమే పోలీసు అధికారులపై వేటు పడింది. అది జీర్ణించుకోకముందే జగన్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న జవహర్ రెడ్డిపై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత ఎన్నికల్లో సీఎస్ జవహర్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో జవహర్ రెడ్డి సహకరిస్తారని జగన్ భావించిన నేపథ్యంలో విపక్షాలకు టార్గెట్ అయ్యారు జవహార్ రెడ్డి. ఢిల్లీ నుంచి అందిన సమాచారం మేరకు సీఎస్ జవహర్ రెడ్డిని తప్పించి, ఇతర అధికారిని నియమించబోతున్నారు. ప్రస్తుతం జవహర్ రెడ్డి ఎందుకు విపక్షాలకు టార్గెట్‌గా మారారో కొన్ని సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దేశ ప్రధాని మోదీ.. ఆంద్రప్రదేశ్ పర్యటన సందర్భంగా సరైన ఏర్పాట్లు చెయ్యలేదనే అపవాదును మూటగట్టుకున్నట్లు తెలిస్తోంది. అంతేకాకుండా చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో కొంత గొడవ కూడా జరిగింది. అది కూడా ప్రధాన మంత్రి మోదీ సభలోనే జరగడంతో, మోదీ కూడా సీఎస్‌పై కొంత మేరకు సీరియస్ అయినట్లు సమాచారం. దాంతో పాటు పెన్షన్ల విషయాన్ని చూసుకుంటే వాలంటీర్లతో పెన్షన్లను పంపిణీ చెయించకుండా, పెన్షనర్లను ప్రభుత్వ కార్యాలయాలకు రప్పించండం జరిగింది. ఈక్రమంలోనే 33 మంది పెన్షనర్లు ఎండతీవ్రత తట్టుకోలేక మరణించారని విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై ఏకంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు జాతీయ మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించడమే కాకుండా, ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా జవహార్ రెడ్డి అధికార పార్టీకి సహకరిస్తున్నాడని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం జవహార్ రెడ్డిపై వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ జవహార్ రెడ్డిని తప్పిస్తే ఎవరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారనే అంశంపై కూడా క్లారిటీ వచ్చిందని తెలుస్తున్నది. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆర్‌పీ సిసోడియా, నీరబ్ కుమార్ ప్రసాద్‌లను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ ఇద్దరిలో నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ ఏడాది జూన్ 30న రిటైర్ కాబోతున్నారు. ఆయన పదవీ విరమణకు నెల వ్యవది మాత్రమే ఉండటంతో నీరబ్‌ను పక్కన పెట్టి 1981 బ్యాచ్‌కు చెందిన ఆర్‌పీ సిసోడియాను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అతనికి ఇంకా రెండేళ్ళ సర్వీస్ ఉండటంతో అతనివైపే ఎక్కువ శాతం అధికారులు మొగ్గుచూపుతున్నారని సమాచారం. ప్రజాప్రతినిధులతో అంట కాగితే, వారి ఇతర కార్యకలాపాలలో పాలుపంచుకుంటే పర్యావసానాలు ఇదేవిధంగా ఉంటాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
Tags:    

Similar News