Gold Siege | నెల్లూరు: కారు తనిఖీ చేసి అవాక్కయిన విజిలెన్స్
సరిహద్దు చెక్ పోస్టుల్లో డొల్లతనం బయటపడింది. చెన్నై బయలుదేరిన కారులో వెంకటాచలం వద్ద తనిఖీ చేశారు. రూ 3.38 కోట్ల నగలు స్వాధీనం చేసుకున్నారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-11 15:21 GMT
చెన్నై నుంచి నెల్లూరు వైపు ఓ కారు వస్తోంది. రెండు చెక్ పోస్టులు నిరాటంకంగా దాటింది. మరో రెండు టోల్ ప్లాజాలు కూడా నిరాంటంకంగా దాటేసింది. అప్పటి వరకు అంటే చెన్నై నుంచి వెంట ఉన్న అదృష్టదేవత పక్కకు తప్పుకున్నట్లు ఉంది. మూడో టోల్ (Toll Plaza) ప్లాజా వద్ద వేగంగా దూసుకు వస్తున్న కారుకు ఓ అధికారి అడ్డు నిలిచారు. వాహనం ఆపక తప్పనిసరి పరిస్థితి. కారులో తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు అవాక్కయ్యారు. సుమారు 3.38 కోట్ల రూపాయల విలువైన నాలుగు కిలోల బంగారు ఆభరణాలు ( Gold jewelry) ఉండడం గమనించారు. వాటిని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు ( Vigilance) ( జీఎస్టీ (GST) అధికారులకు అప్పగించారు.
" ముగ్గురిని అదుపులోకి తీసుకుని, ఆభరణాలు జీఎస్టీ అధికారులకు అప్పగించాం" అని విజిలెన్స్ ఎస్పీ రాజేంద్ర కుమార్ మీడియాకు చెప్పారు.
అక్రమ వ్యాపారం ప్రధానంగా స్మగ్లింగ్ (Smuggling ) నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. వాటిని బురిడీ కొట్టించే విధంగా స్మగ్లర్లు ఎత్తులు వేస్తున్నారు.
దీనికి ఇదో ఉదాహరణ.
నెల్లూరు జిల్లా వద్ద పట్టుబడిన బంగారు ఆభరణాలతో ఆంధ్ర- తమిళనాడు సరిహద్దులోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు ( Integrated Check పోస్ట్), తమిళనాడు ప్రభుత్వ సిబ్బంది డొల్లతనం మరోసారి బట్టబయలైంది.
ఆంధ్ర ప్రాంతంలోని వ్యాపారులు అటు కర్ణాటకకు సమీపంలోని మదనపల్లె అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. ఇటు నెల్లూరుకు సమీపంలో తడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద కూడా పరిస్థితి చూసీచూడనట్లు వ్యవహరించే విధంగా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా
చెన్నై - నెల్లూరు మార్గం
చెన్నై నుంచి బయలుదేరే వాహనాలు ఆంధ్ర సరిహద్దులోని రెడ్ హిల్స్ (RED HILLS) నుంచి కూట్ రోడ్డు నేరుగా తమిళనాడు చెక్ పోస్టు వద్దకు చేరుకుంటాయి. ఇక్కడ చేయి తడిపితే ఏమాత్రం ఇబ్బంది ఉండదనే అపవాదు ఉంది. ఈ చెక్ పోస్టు దాటగానే తమిళనాడు- ఆంధ్ర సరిహద్దులో ఉన్న తడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వరకు చేరుకుంటారు. ఇక్కడ అన్ని శాఖల అధికారులు తనిఖీల కోసం సిద్ధంగా ఉంటారు. ఇక్కడి నుంచి బయలుదేరాక తడ క్రాస్ టోల్ ప్లాజా తరువాత సూళ్లూరుపేట, గూడూరుకు సమీపంలోని బూదనం గ్రామం వద్ద టోల్ ప్లాజా (Toll Plaza), వెంకటాచలం టోల్ ప్లాజా దాటుకుంటే నిరాటంకంగా నెల్లూరు నగరంలోకి చేరుకోవచ్చు.
ఎన్నికల సమయంలో ఓ మీడియా సంస్థ వేళ్లపై లెక్కించే స్థాయిలో కంప్యూటర్లు తరలిస్తుండగా, తనిఖీ అధికారులు నానాయాగీ చేశారు. టాక్స్ చెల్లించలేదనే సాకు చూపించిన అధికారులు ఆ కారు ఆంధ్రలోకి అనుమతించడానికి లేని ఔన్నత్యం ప్రదర్శించారు. జీఎస్టీ అధికారులు మరింత ఉత్సాహం ప్రదర్శించారు. గత్యంతరం లేక ఆ మీడియా వాహనం తిరిగి చెన్నైకి తిరిగి వెళ్లిపోయింది.
బంగారు నగలతో సనాయాసంగా
చెన్నై నగరం నుంచి బయలుదేరిన ఓ కారు ఆ చెక్ పోస్టుల ద్వారా నిరాటంకంగా ప్రయాణం సాగించింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గరకు రాగానే అప్పటికే మాటు వేసి ఉన్న విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. పన్ను చెల్లించకుండా జీరో వ్యాపారం ద్వారా సాగించేందుకు తరలిస్తున్న సుమారు 3.38 కోట్ల రూపాయల నగలు స్వాధానం చేసుకున్నారు. వాస్తవానికి సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం వెనుక కూడా మతలబు ఉందా? అనే సందేహాలకు ఆస్కారం కల్పించారు.
4.2 కిలోల బంగారు స్వాధీనం
నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద చెన్నై నుంచి వచ్చిన కారులో తనిఖీ చేయగా, అందులో 4.2 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. దీనివిలువ రూ.3.38 కోట్లు ఉంటుందన్నారు. బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరులోని ఓ దుకాణానికి తరలిస్తుండగా ఈ నగలు స్వాధీనం చేసుకోవడానికి ముందస్తు సమాచారంతోనే తనిఖీలు సాగించినట్లు సమాచారం. బంగారు ఆభరణాలు తరలిస్తున్న హర్ష జైన్, అన్నరాం, రంజిత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బంగారు ఆభరణాలను, కారును GST అధికారులకు అప్పగించినట్లు నెల్లూరు విజిలెన్స్ SP రాజేంద్ర కుమార్ తెలిపారు.