నీరజ్‌ నీ విజయం దేశానికి గర్వకారణం

దోహో డైమండ్‌ లీగ్‌లో జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా సాధించిన విజయం పట్ల ఆయనను సీఎం చంద్రబాబు అభినందించారు.;

Update: 2025-05-17 10:27 GMT

ప్రపంచ ప్రతిష్టాత్మకమైన దోహా డైమండ్‌ లీగ్‌ టోర్నీలో 90 మీటర్ల జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో నీజజ్‌ చోప్రా ప్రపంచ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా నీరజ్‌ చోప్రాకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా నీరజ్‌ చోప్రా విజయాన్ని పొగుడుతూ ఓ పోస్టు ప్టెట్టారు. నీరజ్‌ చోప్రా విజయం దేశానికే గర్వకారణమంటూ కొనియాడారు. చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రాకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

నీరజ్‌ చోప్రా మరో సారి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు. 90 మీటర్ల మార్కు కంటే ఎక్కువ దోహా డైమండ్‌ లీగ్‌లో జావెలిన్‌ త్రో విసిరి యావత్‌ భారత దేశం గర్వపడే విధంగా చేశారు. ఈ అరుదైన ఘనతను సాధించినందుకు నీరజ్‌ చోప్రాకు హృదయపూర్వక అభినందనలు. ఈ మైలు రాయిని దాటడం ద్వారా భారత్‌ క్రీడా ప్రతిభ మరో సారి ప్రపంచానికి తెలిసింది. నీరజ్‌ చోప్రా నీ విజయం భారత దేశానికే ఓ గర్వకారణం అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News