ఇష్టకామేశ్వరి నెక్కంటి జంగిల్ రైడ్ శిఖరంలో ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎతైన చెట్ల మధ్య అడవిలో సఫారీ ప్రయాణం పర్యాటకులకు వినూత్న అనుభూతిని మిగిలిస్తుంది. పాచెర్ల నల్లమల జంగిల్ క్యాంపును సందర్శించవచ్చు.
జాలువారుతున్న జలపాతాలు
నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలో నల్లమల కొండలు, కోనల నడుమ ఎత్తిపోతల, పెద్ద దూకుడు, గుండం, చలేశ్వరం జలపాతాలున్నాయి. అమ్రాబాద్, శ్రీశ్రైలం, పెద్ద చెరువు, శివపురం, నెక్కంటో పీఠభూములున్నాయి.శ్రీశైలంలోని పురాతన దేవాలయాలు మళికార్జున స్వామి, ఆయన భార్యలైన దేవత భ్రమరాంబ, పార్వతి దేవతల తలంబ్రాలున్నాయి. భారతదేశంలోని పన్నెండు పవిత్ర జ్యోతిలింగాల్లో ఒకటిగా. పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఒకటిగా నిలచింది. నాగార్జున విశ్వవిద్యాలయం, బౌద్ధమత విశ్వవిద్యాలయాలు, మఠాలకు ఈ ప్రాంతం నిలయంగా మారింది. గల గల పారుతున్న కృష్ణానది ఈ టైగర్ రిజర్వ గుండా 270 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అక్క మహాదేవి భిలం, దత్తాత్రేయ భిలం, ఉమా మహేశ్వరం, కదలివనం, పలంకసరి వంటి రాతి ఆశ్రయాలు, గుహ దేవాలయాలు ఉన్నాయి.
అభయారణ్యంలో బర్డ్ వాచింగ్
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో అద్భుతమైన పక్షి జాతులకు నిలయంగా మారింది. ఉదయం వేళ పర్యాటకులు రంగురంగుల పక్షులను తిలకించవచ్చు. చేంజబుల్ హాక్ ఈగిల్, కామన్ టైలర్‌బర్డ్స్, ఓరియంటల్ మాగ్పీ రాబిన్స్, ఇండియన్ స్క్మిటార్ బాబ్లర్, పఫ్ థ్రోటెడ్ బాబ్లర్, వైట్ రంప్డ్ షామా, జంగిల్ బాబ్లర్స్, రెడ్ వాట్లేడ్ లాప్‌వింగ్స్, గ్రీన్ ఇంపీరియల్ పావురాలు, వైట్ బెల్లీడ్ డ్రోంగోస్, గ్రే హార్న్‌బిల్స్, ఇండియన్ రోలర్స్, రూఫస్ ట్రీపీస్, ప్యారడైజ్ ఫ్లైక్యాచర్స్, పారాకీట్స్, ఇండియన్ పీఫౌల్, గ్రే జంగిల్‌ఫౌల్,ఇతర పక్షులను చూడవచ్చు. వివిధ రకాల పక్షుల అరుపులను వినవచ్చు. పక్షులను చూసేందుకు పక్షి ప్రేమికులు బర్డ్ వాచింగ్ వాక్ చేస్తుంటారు.
వన్యప్రాణుల పరిరక్షణ కోసం...
వన్యప్రాణుల పరిరక్షణ కోసం అటవీశాఖ అధికారులు గుంటూరు నుంచి కర్నూల్, నంద్యాల, శ్రీశైలం ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కార్లు, టెంపో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.రాత్రివేళల్లో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు భారీవాహనాలు, బస్సులు, ట్రక్కుల రాకపోకలు నిలిపివేశారు.డోర్నాల, శిఖరం, లింగాలగుట్ట వద్ద అటవీశాఖ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఆకురాల్చే వృక్షాలున్నాయి. లోయలు, కొండలు, గుట్టలతో వెదురు, గడ్డితో అటవీ ప్రాంతం నిండి ఉంటుంది. నల్లమలలో మూలికలు కూడా ఉన్నాయి. వివిధ రకాల చెట్లు, 353 ఔషధమొక్కలకు నల్లమల నిలయంగా మారింది.