మా తల్లి అంజనాదేవి ఆరోగ్యం బాగుంది.. అనవసర ప్రచారం వద్దని ట్వీట్

మెగా అభిమానులు ఆందోళన పడొద్దన్న నాగబాబు;

Update: 2025-06-24 13:12 GMT

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను మెగా బ్రెదర్ నాగబాబు ఖండించారు. ఆమె అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాబినెట్ మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు.దాంతో మెగా అభిమానులు ఆందోళన చెందారు.ఈ నేపథ్యంలో నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తల్లి ఆరోగ్యం గానే వున్నారని అనవసర ప్రచారం వద్దని ట్వీట్ చేశారు.

"మా అమ్మ అంజనాదేవి ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె అనారోగ్యంతో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దు" అని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

Tags:    

Similar News