నీవు చిందించిన చెమట కూటమి గెలుపునకు బాటైంది

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు ఏడాది క్రితం ఏమనుకున్నారంటే..;

Update: 2025-05-12 14:56 GMT

ఆంధ్రప్రదేశ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాణిదెల నాగబాబు ఓ సంచలన పోస్టు పెట్టారు. ఏడాది క్రితం మనం అనుకున్నది అక్షరాల నిజమైంది..అంటూ ఓ పోస్టు పెట్టారు. పవన్‌ కల్యాణ్‌ కష్టపడటం వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది అనేది ఆ పోస్టు సారాంశం. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఇది హల్‌చల్‌ చేస్తోంది.

నాగబాబు ఏమన్నారంటే..
జనసేనాని..
సరిగ్గ ఏడాది క్రితం మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది. మీరు చిందించిన చెమట కూటమి గెలుపునకు బాటైంది. జవాబుదారీ తనంతో కూడిన పరిపాలన ప్రజలకు చేరువైంది. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైంది. ఆడ బిడ్లలు, అక్క చెల్లెళ్లకు రక్షణ తోడైంది. ఐదున్నర కోట్లు ఆంధ్రల కల నిజమైంది. అంటూ పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి నాగబాబు పేర్కొన్నారు. దీనికి ఏడాది క్రితం సరిగ్గ మే12, 2024న వారు ఏమని సంభాషించుకున్నారు పోస్టును కూడా ఈ సందర్భంగా నాగబాబు పోస్టు చేశారు.
ఆ పోస్టులో ఏముందంటే..
నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబతావ అని అడిగితే.. చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని..
నీతో నడవని వాళ్ల కోసం కూడా ఎందుకు నిందలు మోస్తావ్‌ అని అడిగితే.. వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని రైతు కంటిని తడపుకుండా పంటనే తడుపుతుందని..
అప్పటి నుంచి అడగటం మానేసి
ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్థం చేసుకోవడం మొదలెట్టాను..
సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటి తరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది.. కూటమి రాబోతుంది..
సిరా పూసిన సామాన్యుడి వేలి సంతకంతో.. నీ గెలుపు సిద్ధమైంది..
విజయీభవ..... అంటూ నాడు పోస్టు పెట్టారు నాగబాబు. ఇది నెట్టింట తాజాగా వైరల్గా మారింది. దీనిపైన చర్చించుకుంటున్నారు. 


Tags:    

Similar News