Allu Arjun|‘అల్లు అర్జున్ వల్లే నా భార్య చనిపోయింది’..భాస్కర్ ఆరోపణను అంగీకరిస్తారా ?

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో చూడటం కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా ధియేటర్ కు వచ్చి తొక్కిసలాటలో రేవతి(Deceased Reavathi) అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే

Update: 2024-12-06 10:12 GMT

‘అల్లు అర్జున్ థియేటర్ కు రావటం వల్లే నా భార్య చనిపోయింది..నా కొడుకు ప్రాణాపాయస్ధితిలో ఉన్నాడు’..భాస్కర్ ఆరోపణ

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో చూడటం కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా ధియేటర్ కు వచ్చి తొక్కిసలాటలో రేవతి(Deceased Reavathi) అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. తొక్కిసలాట(Stampeding)లో ఆమె కొడుకు శ్రీతేజా కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దిల్ సుఖ్ నగర్ కు చెందిన భాస్కర్, రేవతి దంపతులు పుష్ప-2(Pushpa-2 Movie) సినిమా బెనిఫిట్ షో చూడటం కోసమే సంధ్యా థియేటర్(Sandhya Theatre) కు వచ్చారు. అల్లు అర్జున్(Allu Arjun) కు వీరాభిమాని అయిన కొడుకు నెలరోజుల నుండి గోలచేస్తుంటే సరేని భాస్కర్ టికెట్లు కొని సినిమా చూసేందుకు వచ్చారు.

మరో 5 నిముషాల్లో థియేటర్లోకి వెళ్ళచ్చు అనుకుంటున్న సమయంలో సడెన్ గా అల్లు అర్జున్ థియేటర్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. దాంతో అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలియటంతోనే అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తమ హీరోను దగ్గర నుండి చూడాలన్న కుతూహలం, ఆతృతతో ఎవరికి వారుగా గుంపులుగా ప్రయత్నించారు. దాంతో థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి, తేజ కిందపడిపోయారు. కిందపడిన వాళ్ళని ఎవరూ పట్టించుకోకుండా అలాగే తొక్కేస్తుండటంతో చివరకు ఊపిరి ఆడక తల్లి రేవతి మరణించింది. పోలీసులు జోక్యం చేసుకుని గుంపులను చెదరగొట్టి తేజను కాపాడి వెంటనే చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. థియేటర్లో జరిగింది ఇది.

జరిగిన ఘటనపై తేజ తండ్రి భాస్కర్ మాట్లాడుతు ‘అల్లు అర్జున్ థియేటర్ కు రావటం వల్లే తన భార్య రేవతి చనిపోయిందని, కొడుకు ప్రాణాపాయస్ధితిలో ఉన్నాడ’న్నారు. భార్య చనిపోయి, కొడుకు ప్రాణాపాయస్ధితిలో ఉండటం నిజంగా బాధాకరమే. భాస్కర్ మానసిక పరిస్ధితిని అర్ధంచేసుకోవచ్చు. కాని అల్లు అర్జున్ పై భాస్కర్ చేస్తున్న ఆరోపణలు సమంజసంగా లేదు. ఎందుకంటే కొడుకు అడిగినంత మాత్రాన తండ్రిగా భాస్కర్ మొదటిరోజు మొదటిషోకు అల్లు అర్జున్ సినిమాకు తీసుకెళ్ళటమే తప్పని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పై భాస్కర్ చేసిన ఆరోపణలతో చాలామంది నెటిజన్లు విభేదిస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా పుష్ప-2కి మొదటిరోజు సినిమా చూడాలంటే ఎంత రద్దీగా ఉంటుందో చిన్న పిల్లాడు తేజకు తెలీకపోయినా భాస్కర్ కు తెలీదా అని నిలదీస్తున్నారు. పిల్లాడు అడిగినంత మాత్రాన ఏకంగా ఫ్యామిలీ మొత్తం సినిమా చూడటానికి మొదటిరోజు వచ్చేస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

తన సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రాకూడదన్నట్లుగా భాస్కర్ మాట్లాడటాన్ని మరికొంతమంది నెటిజన్లు తప్పుపడుతున్నారు. తన సినిమాకు తాను రాకుండా ఎలాగుంటాడని భాస్కర్ అనుకుంటాడు అంటూ గట్టిగానే నిలదీస్తున్నారు. ఇతర హీరోల సినిమాల ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలపుడు అభిమానులతో థియేటర్ ఎంత రద్దీగా ఉంటుందో భాస్కర్ కు అంతమాత్రం తెలీదా అని నిలదీస్తున్నారు. ఏదేమైనా తన భార్య మరణానికి అల్లు అర్జున్ థియేటర్ కు రావటమే కారణమన్న భాస్కర్ ఆరోపణను ఎంతమంది అంగీకరిస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News