నాన్నే నాకు మార్గదర్శి

ఫాదర్స్‌డే సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.;

Update: 2025-06-15 11:12 GMT

తన తండ్రి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై మంత్రి నారా లోకేష్‌ తనకున్న గౌరవాన్ని, ప్రేమను, ఆప్యాయతను మరో సారి చాటుకున్నారు. నాకు మార్గదర్శి మా నాన్నే అంటూ లోకేష్‌ పేర్కొన్నారు. ఫాదర్స్‌డే సందర్భంగా ఆదివారం లోకేష్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘నాకు స్పూర్తి.. నా మెంటార్‌.. నా మార్గదర్శి.. నా బాస్‌ అన్నీ మా నాన్నే.. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్నా’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. తండ్రి, సీఎం చంద్రబాబుతో తాను దిగిన ఫొటోను మంత్రి నారా లోకేష్‌ షేర్‌ చేశారు.

ఈ సందర్భంగా కూటమి వర్గాల్లోను, టీడీపీ శ్రేణుల్లోను తండ్రీ, కొడుకులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల మధ్య ఉన్న అనుబంధం మరో సారి చర్చనీయాంశంగా మారింది. తండ్రీ, కొడుకులైనప్పటికీ.. వేదికలపై మాట్లాడుతున్నప్పుడు లోకేష్‌ గారు అంటూ చంద్రబాబు గౌరవంగా సంబోధించడం, బాబు గారు అంటూ తండ్రి చంద్రబాబును లోకేష్‌ రెట్టింపు స్థాయిలో గౌరవాన్ని చాటుకోవడం ముచ్చటగా ఉంటుందని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News