కోర్టుకు ఎంపీ మిథున్‌రెడ్డి..గేట్లు క్లోజ్‌ చేసిన పోలీసులు

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి శనివారం సిట్‌ విచారణకు హాజరయ్యారు.;

Update: 2025-07-20 09:04 GMT

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు ఆదివారం మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు. అంతకు ముందు సిట్‌ కార్యాలయం నుంచి మిథున్‌రెడ్డిని విజయవాడ జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులన్నింటినీ పరిశీలించిన జీజీహెచ్‌ వైద్యులు మిథున్‌రెడ్డికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్థారించారు. అనంతం అక్కడ నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన మద్యం పాలసీలో ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉందని, ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డికి రిమాండ్‌ విధించాలని పోలీసులు కోర్టును కోరనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నారు.

మరో వైపు విజయవాడ కోర్టు వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యాయవాదులను కోర్టులోకి అనుమతించకుండా కోర్టుకు అన్ని వైపుల ఉన్న గేట్లను పోలీసులు మూసివేశారు. దీంతో పాటుగా కోర్టుకు చుట్టుపక్కల బారికేడ్లను అడ్డంగా పెట్టి రోడ్లను కూడా మూసివేశారు. కోర్టు ప్రధాన ద్వారాం గేట్లను కూడా క్లోజ్‌ చేయడంతో న్యాయవాదులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు గేట్లు మూసి వేసే అధికారం ఎవరిచ్చారని పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో న్యాయవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోర్టులోకి న్యాయవాదులను వెళ్లనీకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్దమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News