సిట్ ఎదుట హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి
వైఎస్సార్సీపీ నాయకుడు పి మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు విచారిస్తున్నారు.;
ఏపీ మద్యం కుంభకోణంలో నాలుగో నిందితునిగా ఉన్న రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం మద్యహ్నం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో విచారించేందుకు ఇప్పటికే పలు సార్లు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన హైకోర్టు, సుప్రీం కోర్టులను ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. కోర్టులు బెయిల్ నిరాకరించడంతో నేడు సిట్ విచారణకు వచ్చారు. సిట్ విచారణ ఎంత సేపు జరుగుతుందోనని ఆయన అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కొద్ది సేపటి క్రితం విజయవాడలోని సీపీ కార్యాలయంలో ఉన్న మద్యం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు.
మిధున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో సీపీ ఆఫీసు వద్దకు ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వారు చేరుకున్నారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి కూడా మిథున్ రెడ్డితో కలిసి వచ్చారు. విచారించే సమయంలో వీడియోలు తీస్తారా? న్యాయవాదులు ఉంటారా? లేదా? అనే సందేహాలకు పోలీసులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.