అమెరికా నుంచి 750కి పైగా తప్పుడు పోస్టులు పెట్టారు

యూరియాపై రైతులు, ప్రభుత్వం మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. శాంతి భద్రతలపై సమీక్షలో సీఎం చంద్రబాబు;

Update: 2025-09-16 14:19 GMT

క్రైమ్ రేట్ 4 శాతం మేర, సైబర్ క్రైమ్ 16 శాతం పెరిగిందని చెబుతున్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలి. డ్రగ్స్‌ నివారణపై ఇంకా ప్రచారం పెరగాలి. గంజాయి వినియోగం అరికట్టేలా మరింత ఫోకస్ పెట్టాలి. గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేలా నిఘా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రెండో రోజు జరిగిన సమీక్షలో కలెక్టర్లు, ఎస్పీలకు ఉద్భోదించారు.

డ్రగ్స్ ను ఓవర్ నైట్ నియంత్రించాం అనుకోవటం సరికాదు... అదో నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. సీసీటీవీ కెమెరాలు భద్రతా పర్యవేక్షణకు ఉపయోగపడతాయి. నియంత్రణ లేకపోవటం వల్లే 90 శాతం మేర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ లో ప్రజలు నెలకు రూ.30 కోట్ల మేర కోల్పోతున్నారు. క్రిమినల్స్ టెక్నాలజీ మాస్టర్లుగా ఉన్నారు... వారికంటే అడ్వాన్స్‌గా మనవాళ్లు మారాలి అని అన్నారు.

ఫోరెన్సిక్స్ కూడా మరింత సమర్ధవంతంగా ఉండాలి. క్రైమ్ జరిగిన తర్వాత ఎంత సమయంలోగా ఘటనా స్థలికి వెళ్లగలుగుతున్నారు, క్రైమ్ సీన్ ప్రోటెక్షన్ ఎలా జరుగుతోందన్నది కూడా ముఖ్యం అని అన్నారు. పోలీసు డాగ్స్ శిక్షణ, ప్రతీ రెవెన్యూ డివిజన్ లో డాగ్ స్క్వాడ్ ఉండాలి. క్రైమ్ సీన్ సైట్ ను డెస్ట్రాయ్ చేయటం పెద్ద నేరం, వివేకా హత్యకేసు అతిపెద్ద ఘటన. ఒక సీఐ దగ్గరుండి రక్తం కడిగించటం ఏమిటి? అప్పట్లో ఆ వివరాలను ఎవరూ నా నోటీసుకు తేలేకపోయారు. అంతర్గత భద్రత అనేది ఇప్పుడు ఓ అంశంగా మారిపోయింది. దీనిపైనా దృష్టి పెట్టాలని అన్నారు.

ఇంటెలిజెన్స్ నిఘా మరింతగా పెరగాలి. టూరిజం రావాలి అంటే భద్రత ఉండాలి. జిల్లాల్లో బ్యాండ్ విడ్త్ పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం, ఆర్టీజీఎస్ తో లింక్ చేసి సమాచారం ప్రభుత్వం నుంచి ఇస్తామని అన్నారు. అవేర్ ద్వారానూ 42 పారామీటర్లలో సమాచారం పోలీసులకు అందేలా చేస్తాం. సింగపూర్ లో విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ టెక్నాలజీ అందిపుచ్చుకుని మనం అదే స్థాయికి వెళ్లాలన్నారు.

క్రైమ్ కన్విక్షన్ రేట్ ను పెంచాల్సి ఉంది. లా ఆండ్ ఆర్డర్ లో నో కాంప్రమైజ్. జీరో టాలరెన్స్ మా ప్రభుత్వ విధానం. సుగాలీ ప్రీతి కేసును ఇప్పుడు సీబీఐకి పంపించాం. పాత సెన్సిటివ్ కేసులు వెలికితీయండి. గత ప్రభుత్వంలో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్, చంద్రయ్య హత్య కేసు, అమర్నాథ్ గౌడ్ కేసు వంటివాటిల్లో బాధితులకు న్యాయం చేయాలని అన్నారు.

యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ విస్తృతం కావాలి. సీరియస్ క్రైమ్ ను 50 శాతానికి తగ్గించగలం. ఈ విషయంలో కొందరిని గట్టిగా డీల్ చేసి నేరస్తుల్లో భయం తేవాలి. గత ఏడాది కంటే ఈసారి 30 శాతం నేరాల రేటు తగ్గేలా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలి. అలాగే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగాలన్నారు.

మనసుపెట్టి పనిచేస్తే అన్నీ సాధ్యమే. శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదు. గతంలో కమ్యూనల్ వయలెన్సు విషయంలో నేను స్పాట్ కు కూడా వెళ్లాను. గంటలోగా క్రైమ్ సీన్ కు వెళ్లగలిగితే నేరాలకు పాల్పడేందుకు నేరస్తులు ఎవరూ ధైర్యం చేయలేరు. లా అండ్ ఆర్డర్ లో ఫర్మ్ నెస్ ఉంది అనే భావన ప్రజల్లో ఉండాలన్నారు.

Tags:    

Similar News