చంద్రబాబుపై మోదీ పొగడ్తల వర్షం

ప్రధాని నరేంద్ర మోదీని మాటలకు ముసి ముసి నవ్వులు నవ్వుకున్న చంద్రబాబు.;

Update: 2025-05-02 13:07 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. అమరావతి నిర్మాణా పనులు పునఃప్రారంభ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా అనుభవంతో చెబుతున్నా.. ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొని రావాలన్నా.. వాటిని సకాలంలో వేగవంతంగా పూర్తి చేయాలన్నా.. క్వాలిటీతో వాటి నిర్మాణాలు చేపట్టాలన్నా.. వాటి ద్వారా ప్రజలకు మేలు చేకూర్చాలన్నా అది కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం అవుతుందని.. చంద్రబాబును మించిన వారు లేరని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి వక్కాణించారు.

ప్రధాన మంత్రి ఈ మాటలు మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముసి ముసినవ్వులు నవ్వుకుంటూ మురిసి పోయారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను, తన పనితీరును, తానా కష్ట పడుతున్న విధానాన్ని, గుర్తించి లక్షలాది మందిలో, భారత దేశం యావత్తు తెలిసేలా ప్రస్తావించి పొగడ్తలతో ముంచెత్తడంతో ఆనందంతో ఉబ్బితబ్బుబ్బై పోయారు చంద్రబాబు.
అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్‌ సిటీ నిర్మాణం, ఐటీని తీసుకొచ్చిన దానిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ మరో సారి సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. నేనేదో టెక్నాలజీని, ఐటీనీ తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ నేను గుజరాత్‌ సీఎంగా ఉండగా.. నాడు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్నారు. టెక్నాలజీ, ఐటీ విషయంలో నాడు చంద్రబాబును చూపించిన చొరవను దగ్గరుండి నేను తెలుసుకునే వాడిని.
వాటి గురించి తెలుసుకొని రావాలని గుజరాత్‌ నుంచి అధికారులను నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పంపించే వాడిని.. వారి నుంచి విషయాలు తెలుసుకునే వాడిని. అప్పుడు తెలుసుకున్న విషయాలు ఈ రోజు మీ ముందు నేను చేయగలుగుతున్నాను అంటూ సీఎం చంద్రబాబుపై ప్రంశసల జల్లు కురిపించారు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే చంద్రబాబు ఈ సమయంలో కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసి పోయారు. ప్రధాన మంత్రి తన తండ్రి చంద్రబాబు గురించి సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ పొగుతూ ఉంటే భావోద్వేగాలు ఆపుకోలేక చప్పట్లతో తన తండ్రిని అభినందిస్తూనే ఉన్నారు. దీనికి పక్కన కూర్చున తోటి మంత్రులు కూడా క్లాప్స్‌ కొడుతూ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
Tags:    

Similar News