లిక్కర్ స్కాం కేసులో సిట్ కస్టడీకి మిథున్ రెడ్డి
రెండు రోజులపాటు మిథున్ రెడ్డిని విచారించనున్న సిట్ అధికారులు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ కస్టడీలోకి తీసుకుంది. రెండు రోజుల పాటు ఆయన్ను సిట్ అధికారులు విచారించనున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించడంతో, ఈ ఉదయం సిట్ అధికారులు మిథున్ రెడ్డిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలించారు.అంతకు ముంది ఈకేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మిథున్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, రెండు రోజులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ఆదేశాల ప్రకారం, సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మిథున్ రెడ్డిని విచారించనున్నారు.