వల్లభనేని వంశీ మీద మైనింగ్ కేసు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మీద కేసులు మీద కేసులు నమోదు అవుతున్నాయి.;
ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమీద తాజాగా మరో కేసు తెరపైకి వచ్చింది. మైనింగ్ కేసును తెరపైకి తీసుకొచ్చారు. అక్రమ మైనింగ్ పాల్పడాడని కేసు నమోదు చేశారు. గన్నవరంలో అక్రమ మైనింగ్‌కు వల్లభనేని వంశీ పాల్పడ్డారని, మైనింగ్ శాఖకు చెందిన అడిషనల్ డైరెకర్టర్(ఏడీ) గన్నవరం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. గన్నవరంలో వంశీ అక్రమ మైనింగ్ పాల్పడిన వివరాలతో కూడిన నివేదికను పోలీసులకు అందజేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు నాడు ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీతో పాటు అతని అనుచరులు చేసిన అక్రమ మైనింగ్‌కు సంబందించిన వివరాలన్నీ ఆ నివేదికలో ఉన్నట్లు మైనింగ్ శాఖ అధికారులు పోలీసులకు వివరించారు. దాదాపు రూ. 100 కోట్ల విలువైన అక్రమ మైనింగ్‌లకు పాల్పడ్డారని వంశీపై ఫిర్యాదు చేశారు. మైనింగ్ శాఖ అధికారుల ఫిర్యాదుల మేరకు వల్లభనేని వంశీపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.