మూడేళ్లల్లో మెట్రో పూర్తి చేస్తాం

విజయవాడ మెట్రో రైల్‌కు నేడో, రేపో టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు.;

Update: 2025-07-25 15:06 GMT

మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌లను రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. శుక్రవారం లెనిన్‌ సెంటర్‌ లోని సీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ 2014 ఏపీ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌ ప్రకారం విశాఖపట్టణం, విజయవాడలలో మెట్రో రైల్‌ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందన్నారు. ఫీజుబుల్టీ రిపోర్టు స్టడీ చేయడానికి ఆరు నెలలు సమయం పట్టిందన్నారు. కేంద్రం అనుమతించిన మేరకు మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

ముందుగా విశాఖపట్టణంలో మెట్రో రైల్‌కు టెండర్లు ఇవ్వడం జరిగిందని, నేడో, రేపో విజయవాడ మెట్రోకు టెండర్లు పిలవటం జరుగుతుందన్నారు. కేంద్రం మెట్రో రైల్‌ నిర్మాణానికి పాలసీ మార్చిందని మారిన పాలసీ ప్రకారం మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. కేబినెట్‌ భేటీలో మెట్రో రైల్‌ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా 20 శాతం, కేంద్రం వాటాగా 20, మిగతాది కేంద్రం అనుమతితో సాప్ట్‌ లోన్‌ ను 30 సంవత్సరాల కాలపరిమితితో తక్కువ వడ్డీ రేటుకు అంతర్జాతీయ సంస్థల నుంచి కేంద్రం అందించడం జరుగుతుందన్నారు.
విశాఖపట్టణం మెట్రో రైల్‌ నిర్మాణాలు విశాఖపట్టణం మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండు పేజీల్లో పనులు చేపట్టడం జరుగుతుందని మొదటి పేజ్‌ లో మొత్తం 46 కిమీ మెట్రో లైన్‌ నిర్మాణం 42 స్టేషన్లతో మొత్తం రూ. 11,490 కోట్ల అంచనాతో మూడు క్యారిడార్ల లో మెట్రో రైల్‌ నిర్మాణం. మొదటి కారిడార్‌ ను స్టీల్‌ ప్లాంట్‌ గేటు నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు 34.40 కిమీ మెట్రో లైను 29 స్టేషన్ల తో నిర్మాణం... రెండో కారిడార్‌ గురుద్వారా జంక్షన్‌ నుంచి ఓల్డ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వరకు 5.7 కిమీ మెట్రో లైను ఆరు స్టేషన్ల తో నిర్మాణం, కారిడార్‌ మూడు ను తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిమీ మెట్రో లైను 7 మెట్రో స్టేషన్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు.
విజయవాడ మెట్రో ను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ఆధ్వర్యంలో మొదటి పేజ్‌ ను రూ. 10,118 కోట్ల అంచనా వ్యయంతో 32.40 కిమీ మేర నిర్మాణం. మొదటి కారిడార్‌ ను 25.9 కిమీ ను పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టు వరకు రెండో కారిడార్‌ ను పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ నుంచి పెనమలూరు వరకు చేపట్టనున్నారన్నారు.
విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారం కోసం కన్సల్టెన్సీతో ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకష్ణా రెడ్డి ల మధ్య అవగాహన ఒప్పందాన్ని మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందంపై ప్రతినిధులు సంతకాలు చేశారు. విజయవాడ మెట్రో డిజైన్‌ లు, సాంకేతికత, పనుల పర్యవేక్షణ కు టిప్సాతో, విశాఖ కు శిస్ట్రా కన్సల్టెన్సీలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
అమరావతి రాజధాని రైతులకు జరీబు భూములకు రూ. 50,000, నాన్‌ జరీబు భూములకు రూ. 30,000 చెల్లించడం జరిగిందన్నారు. 18,638 మంది రైతులకు రూ. 163.67 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రదారాలను నమ్మవద్దని రాజధాని రైతులను కోరారు. బ్యాంకు ఇబ్బులు, ఎకౌంట్స్‌ ఇబ్బందులతో ఇంకా కొద్దిమందికి డబ్బులు వారి ఎకౌంట్లలో జమ కాకపోయినా త్వరలోనే వాటిని కూడా సరిచేసి అందిస్తామన్నారు. ఏపీ సచివాలయంలో తాత్కాలికంగా పనిచేస్తున్న స్కావెంజర్స్, స్వీపర్స్‌ కు రాజధాని ప్రాంతంలో అందించే పెన్షన్‌ ను ప్రభుత్వం ఇచ్చే విదంగా ఆదేశాలు ఇచ్చామన్నారు.


Tags:    

Similar News