MEGA FAMILY | మెగా ఫ్యామిలితో అల్లు అర్జున్ కి సయోధ్య కుదిరినట్టేనా?
మెగాస్టార్ చిరంజీవి, ఆయన భావ అల్లు అరవింద్ కుటుంబాల మధ్య కొంత కాలంగా నడుస్తున్న వివాదాలకు పుష్ప 2 పుల్ స్టాప్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.;
By : The Federal
Update: 2024-12-08 06:38 GMT
మెగాస్టార్ చిరంజీవి, ఆయన భావ అల్లు అరవింద్ కుటుంబాల మధ్య కొంత కాలంగా నడుస్తున్న వివాదాలకు పుష్ప 2 పుల్ స్టాప్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ కుటుంబాలు ఇటీవలికాలంలో ఉప్పు నిప్పులా ఉంటున్నాయి. రెండు కుటుంబాల మధ్య రాకపోకలు, మొహం చూపులు కూడా లేని నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు పుప్ప 2: ది రూల్ సినిమా విడుదల పనికి వచ్చినట్టు పరిశీలకులు చెబుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా పుష్ప 2 సినిమాకి దర్శకత్వం వహించిన సుకుమార్, ఆ చిత్ర నిర్మాతలు నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశిస్సులు పొంది వచ్చారు. ఆ తర్వాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ తరఫున కూడా కొందరు ప్రముఖులు చిరంజీవి ఇంటికి వెళ్లి మాట్లాడివచ్చినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పుష్ప 2 సినిమాను బహిష్కరించాలని అనుకుంటున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. చిరు అభిమానుల ఎఫెక్ట్ పుష్ప 2 పై పడకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు.
సరిగ్గా ఈ దశలో ఇంకో అద్భుత పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపుగా 12500 స్క్రీన్స్ లో రిలీజ్ కాగా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ.449 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో శుక్రవారం పుష్ప 2 చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సస్ మీట్ కి హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ తదితరులతో పాటూ సినిమా యూనిట్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, సినిమాటోగ్రఫీ మంత్రులకి థాంక్స్ చెప్పాడు. ఇందులో భాగంగా టికెట్ రేట్ల విషయంలో సానుకూలంగా స్పందించి అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమిటి రెడ్డి వెంకటరెడ్డి తదితరులకు ధన్యవాదాలు తెలిపాడు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ముందుగా తన మామ పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాతే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపాడు.
అయితే ఇందులో అల్లు అర్జున్ మరోసారి కళ్యాణ్ కి థాంక్స్ అని చెప్పగానే అభిమానులు కేకలు, ఈలలతో హంగామా చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా మెగా కాంపౌండ్ లో వివాదాలు ఉన్నాయని దీంతో అల్లు అర్జున్ కి మెగా హీరోలకి పడటం లేదని అందుకే పుష్ప 2 కి సపోర్ట్ చెయ్యడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సక్సస్ మీట్ లో పవన్ కి బన్నీ థాంక్స్ చెప్పడంతో ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడింది.
ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 సినిమా తెలుగుతోపాటూ నార్త్ లో కూడా భారిగా కలెక్షన్లు సాధిస్తోంది. కాగా బాలీవుడ్ హీరోల హయ్యెస్ట్ రికార్డులని సైతం బ్రేక్ చేస్తోంది. కాగా ఇప్పటికే హిందీలో హెయ్యెస్ట్ డే ఓపెనింగ్స్ లో టాప్ లో ఉన్న జవాన్ సినిమా రికార్డులని బ్రేక్ చేసింది.
టికెట్ రేట్స్ విషయంలో మాకు సపోర్ట్ చేసిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు థ్యాంక్యూ. ఏపీ డిప్యూటీ సీఎం, పర్సనల్‌గా మా కళ్యాణ్ బాబాయ్‌కి థ్యాంక్యూ సో మచ్. సినిమా పెద్ద స్థాయిలో వెళ్తుంది. తెలుగు వారంతా గర్వించే స్థాయికి చేరుకుంటుందని అనుకుంటున్నా. ఇలాంటి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది’ అని అర్జున్ చెప్పాడు. అలాగే సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, త్వరలోనే ఆ ఫ్యామిలీని వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పాడు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని ప్రతి నిమిషం ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశా. దీనికోసం మా టీమ్ అంతా అహర్నిశలు కష్టపడ్డాం’ అని అన్నారు. ‘ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచి ట్రెమండెస్ రెస్పాన్స్ వస్తోంది. ఫాస్టెస్ట్ గా రూ.500 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరింత విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం’ అని నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ చెప్పారు.