సూత్రదారి సజ్జలేనా

నేడు సీఐడీ విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌లు హాజరు కానున్నారు.;

Update: 2025-05-09 04:51 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగ వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నుల్లోనే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. దీని వెనుక ప్లాన్‌ వేసింది. అమలయ్యేలా చేసింది, దాడికి సూత్రదారి సజ్జల రామకృష్ణారెడ్డే అని సీఐడీ తేల్చింది. ఈ నేపధ్యంలో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గం వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరు సీఐడీ కార్యాలయంలో నిర్వహించే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌లను ఆదేశించారు. ఈ మేరకు ఇరువురు నేతలు శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరు సీఐడీ కార్యాలయంలో నిర్వహించే విచారణకు హాజరు కానున్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2021అక్టోబరు 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేత పట్టాభి నాటి సీఎం జగన్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి, విమర్శించిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు టీడీకీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
దీనిపై అప్పుడే కేసు నమోదైంది. కానీ ఎలాంటి చర్యలు లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దృష్టి పెట్టింది. లోకల్‌ పోలీసుల నుంచి సీఐడీకి ఈ కేసును అప్పగించింది. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు విచారణలకు తెరతీశారు. ఈ కేసులో నాడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఏ–120 నిందితుడిగా చేర్చారు. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంతో పాటు పలువురి నేతలను నిందితులుగా చేర్చారు.
Tags:    

Similar News