ప్రధాన మంత్రి బాల పురస్కార్‌ అవార్డు అందుకున్న మంగళగిరి బాలిక

ఆంధ్రప్రదేశ్‌ నుంచి చాలా మంది ఈ అవార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన కేంద్రం జెస్సీ రాజ్‌ను ఎంపిక చేసింది.

By :  Admin
Update: 2024-12-26 13:23 GMT

వీర బాలల జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని మాత్రపు జెస్సీ రాజ్‌ క్రీడల విభాగంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అరుదైన అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సాహస బాలలను గౌరవించాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా డిసెంబరు 26న ప్రధాన మంత్రి బాల పురస్కార్‌ అవార్డులను ప్రధానం చేస్తోంది. 2024వ సంవత్సరానికి ఎంపికైన బాలల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జెస్సీ రాజ్‌ ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన సురేష్, రాధ దంపతుల కుమర్తె ఈ జెస్సీ రాజ్‌. ఈ అవార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన కేంద్ర స్థాయి కమిటీ జెస్సీ రాజ్‌ను అవార్డు కోసం ఎంపిక చేశారు. క్రీడల విభాగంలో న్యూజీల్యాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్టిస్టిక్‌ స్కేటింగ్‌ పోటీలో భారత దేశం తరపున పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన జెస్సీ రాజ్‌కు ప్రధాన మంత్రి బాల పురస్కార అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న సందర్భంగా బాలికను, ఆమె తల్లిదండ్రులను గుంటూరు జిల్లా కలెక్టర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌లు అభినందించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు పొందనున్నారు.

Tags:    

Similar News