లడ్డూ వివాదంపై మ్యాడమ్ యూటర్న్

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ, ప్రసాదాల తయారీలో జంతుకొవ్వు, చేపనూనె కలిసిందనే చంద్రబాబునాయుడు ఆరోపణల మీద జనాల్లో మెల్లిగా భ్రమలు తొలగిపోతున్నాయి.

Update: 2024-10-01 09:19 GMT

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ, ప్రసాదాల తయారీలో జంతుకొవ్వు, చేపనూనె కలిసిందనే చంద్రబాబునాయుడు ఆరోపణల మీద జనాల్లో మెల్లిగా భ్రమలు తొలగిపోతున్నాయి. సుప్రింకోర్టు విచారణ తర్వాత అందరినీ కమ్ముకున్న మబ్బులు చెదిరిపోతున్నాయి. దీనికి సాక్ష్యం ఏమిటంటే హింతుత్వానికి తామే ఛాంపియన్లమనేట్లుగా వ్యవహరించిన బీజేపీ నేత మాధవీలత తాజా స్టాండే. లడ్డూ వివాదంపై మాధవీ మ్యాడమ్ యూటర్న్ తీసుకున్నారు. నాలుగురోజుల క్రితం ఇదే మ్యాడమ్ జగన్మోహన్ రెడ్డి వల్ల తిరుమల దేవాలయం, ప్రసాదాలు అపచారం అయిపోయాయని నోటికొచ్చినట్లు మాట్లాడారు. మాట్లాడటమే కాకుండా తన మద్దతుదారులను తీసుకుని భజనచేసుకుంటు హైదరాబాద్ నుండి తిరుపతి చేరుకుని కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

హైదరాబాద్ నుండి బయలుదేరి తిరుమల చేరుకునేంత వరకు మ్యాడమ్ జగన్ను తిట్టని తిట్టులేదు. జగన్ వల్ల తిరుమల దేవాలయం, ప్రసాదాలే కాదు హోలుమొత్తం మీద హిందుమతానికే అపచారం జరిగిపోయిందని నానా రచ్చచేశారు. దేవుడిమీద నమ్మకం లేని జగన్ మళ్ళీ తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవటం ఏమిటని మండిపోయారు. జగన్ అసలు తిరుపతిలోకి కూడా అడుగు పెట్టనీయకూడదని పిలుపిచ్చారు. ఇదంతా దేనికంటే జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆధారంగా చేసుకుని మాధవి రెచ్చిపోయారు.

సీన్ కట్ చేస్తే మ్యాడమ్ భ్రమలన్నీ తొలగిపోయినట్లున్నాయి. అందుకనే సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబును వాయించేస్తున్నారు. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు ‘ఏమీలేని చోట ఒక టెస్టు పేపర్ పెట్టుకుని ముఖ్యమంత్రి లేచి నిలబడి ఇలా కల్తీ జరిగింది అని లేనిది చెప్పి అబద్ధాన్ని చెప్పి ఒకళ్ళని బ్యాడ్ చేయటం అంటే చిన్న విషయమా’ ? అని నిలదీశారు. ‘120 కోట్ల హిందువులను టెస్టు చేయటమా’ ? అని మండిపోయారు. ‘అరే వాడికి కాస్త ఉండాలి అంటు తల(బుర్ర)ను చూపించారు. ‘ఆయన(చంద్రబాబు) ఏ పార్టీకి సంబంధించిన వాడన్నది వేరే కత. ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చిన 100 రోజుల్లోనే ఇంత రిస్క్ తీసుకుంటారా’ ? అని ప్రశ్నించారు.

మాధవీ మ్యాడమ్ తాజా వ్యాఖ్యలు విన్నతర్వాత చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే అని అర్ధమైనట్లుంది. చంద్రబాబు చేసిన ఆరోపణలను పట్టుకుని తాను జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడిన మాటలు ఈమెకు గుర్తున్నట్లు లేదు. అయినా చంద్రబాబు చేసే ఆరోపణల్లో వాస్తవాలు ఎంతుంటాయన్న విషయం మాదవికి తెలీదా ? తన పబ్బం గడుపుకోవటం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని మాధవికి అంతమాత్రం తెలీదా ? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు మీద భ్రమలు తొలగిపోయాయి సరే మరి జగన్ పై తాను మాట్లాడిన మాటలపైన వివరణ ఎందుకు ఇవ్వలేదు ?

Tags:    

Similar News