మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ తొలగింపు

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది.;

Update: 2025-05-14 12:57 GMT

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి షాక్‌లు మీద షాక్‌లు ఇస్తోన్న కూటమి ప్రభుత్వం తాజగా బుధవారం మరో ఘట్టి షాక్‌ ఇచ్చింది. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ను కూటమి ప్రభత్వం తొలగించింది. మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ కిశోర్‌ను తొలగిస్తూ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ సురేష్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న టి కిశోర్‌ అధికార, పదవి దుర్వనియోగానికి పాల్పడ్డారని, మున్సిపల్‌ చట్టం 1965 సెక్షన్‌ 16(1)ను ఉల్లంఘించారనే ఆరోపణలు కిశోర్‌పై ఉన్నాయి. అనుమతి లేకుండా 15 సార్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న తురకా కిశోర్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ సురేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. తురకా కిశోర్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ప్రధాన అనుచరుడు. కూటమి ప్రభుత్వం కిశోర్ ను తొలగించడంతో పిన్నెల్లి కూడా గట్టి షాక్ తగిలింది. 
Tags:    

Similar News