లిక్కర్‌ షాపులకు నేడు లాటరీ.. రేపు అప్పగింత

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల కోసం సోమవారం లాటరీ నిర్వహించనున్నారు. దీంతో షాపులు ఎవరికి దక్కుతాయోననే దరఖాస్తు దారుల్లో ఉత్కంఠ నెలకొంది.

Update: 2024-10-14 05:51 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల కోసం సోమవారం లాటరీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిక్కర్‌ షాపులు తమకు దక్కుతాయో లేదో అనే ఆందోళనల్లో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. అన్ని ప్రాంతాల్లో 89,882 మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు రుసుం కింద ఒక్కో దరఖాస్తుదారుడు రూ. 2లక్షలు చెల్లించారు. ఈ దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వచ్చి చేరింది. రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది.
అనంతపురం జిల్లాలో తక్కువ దరఖాస్తులు వచ్చాయి. 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో వాటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.
అయితే మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సోమవారం ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో లాటరీ చేపట్టనున్నారు. లాటరీ పధ్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపులు చేయనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లాటరీ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత అక్టోబరు 15 మంగళవారం ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 16 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ రానుంది.
Tags:    

Similar News