టీడీపీ కార్యాలయం ఎదురుగా లారీ దగ్ధం

మంగళగిరి జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.;

Update: 2025-08-06 10:19 GMT

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా విజయవా–గుంటూరు జాతీయ రహదారి మీద ఓ లారీ దగ్ధమైన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరక్క పోయినా.. భయబ్రాంతులకు గురిచేసింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగ్గానే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఆగి ఉన్న లారీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడం, ఒక్కసారిగా పెద్దవి కావడంతో లారీ మొత్తం దగ్ధం కావడం, అందులో ఉన్న సిలీండర్లు పెద్ద శబ్దంతో పేలడంతో ఆ ప్రాంతపు ప్రజలు, వాహనదారులు ఒక్క సారిగా తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. టీడీపీ కార్యాలయం ఎదురుగా హైవే మీద మార్టిన్‌ పెయింట్‌ వేసే లారీ నిలిచి ఉంది. దీనిలో గ్యాస్‌ సిలిండర్లు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా లారీ నుంచి మంటలు చెలరేగాయి. లారీలో ఉన్న నాలుగు సిలిండర్లు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలాయి. ఈ భారీ పేలు శబ్దానికి సమీపంలోని ప్రజలు, స్థానికులు, వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా చెలరేగిన మంటలను అదుపు చేశారు. మంగళగిరి పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనదారులను, ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News