విఆర్ పాఠశాలను తిరిగి ప్రారంభించిన లోకేష్

150 ఏళ్ల చరిత్ర ఉన్న నెల్లూరు వీఆర్ హైస్కూల్ మూతపడింది. మంత్రి నారాయణ దీనిని తిరిగి బాగు చేశారు.;

Update: 2025-07-07 09:30 GMT

వీఆర్ పాఠశాలకు 150 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఆరు నెలలు కిందట ఘోరమైన పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడు చూస్తే నేను అసూయ పడేలా మంత్రి నారాయణ మార్చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. చాలా చక్కగా మంత్రి నారాయణ (Minister Narayana) వీఆర్ హైస్కూల్‌ను తీర్చిదిద్దారని అభినందించారు. నెల్లూరులోనే ఇలాంటి అత్యాధునిక స్కూల్ ఎక్కడా లేదని, అందుకే ఇక్కడ చేరామని పిల్లలు చెబుతున్నారన్నారు. నెల్లూరులోని వీఆర్‌ హైస్కూల్‌ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు.  


మంత్రి పొంగూరు నారాయణ గారి కృషితో సుమారు 15కోట్ల రూపాయలతో అత్యుత్తమంగా తయారుచేసిన నెల్లూరు విఆర్ హైస్కూలును ఈరోజు నా చేతులమీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయేరోజుల్లో ఏపీ విద్యావ్యవస్థను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతానని చెప్పాను. నెల్లూరు విఆర్ హైస్కూల్ దేశంలోనే నంబర్ వన్ మోడల్ స్కూల్ గా అవతరించిందన్నారు. ఈ పాఠశాలను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి మంత్రి నారాయణ గారు రూపకల్పన చేశారు, నెల్లూరు నగరంలోని VR (వెంకటగిరి రాజా వారి ) ఉన్నత పాఠశాల 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నారు. 1875 లో స్థాపించిన ఈ పాఠశాల నెల్లూరుకు గర్వకారణం. మంత్రి నారాయణ నాయకత్వంలో VR మున్సిపల్ ఉన్నత పాఠశాల తిరిగి ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ఇక్కడ చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. స్వర్గీయ బెజవాడ గోపాల్ రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారు ఈ పాఠశాల పూర్వవిద్యార్థులేనన్నారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో కూడా ఇదేవిధంగా స్కూలును అభివృద్ధి చేస్తున్నా. రాబోయే అయిదేళ్లలో విఆర్ హైస్కూలు తరహాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నియోజకవర్గాల్లో లీప్ మోడల్ స్కూళ్లను అభివృద్ధిచేస్తామని మంత్రి చెప్పారు. 

భూమి కంటే ఎక్కువుగా మన భారం మోసేది అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లిని గౌరవిస్తూ ముందుకు వెళుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ, ఆయన కుమార్తె శరణి చేసిన కృషి చాలా గొప్పదని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో పేద కుటుంబమే ఉండకూడదని, ప్రతీ ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని సీఎం చంద్రబాబు P4 తీసుకొచ్చారని తెలిపారు. మంగళగిరిలో ఓడిపోయినప్పుడు బాధపడ్డానని, కానీ గెలవాలనే లక్ష్యంతో కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలుపొందానని వెల్లడించారు. అందరూ వద్దన్నా కూడా కష్టమైన విద్యాశాఖ తీసుకున్నానని తెలిపారు.

ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సూచనతో మధ్యహ్న భోజనంలో సన్నబియ్యం అన్నం తెచ్చామన్నారు. తొమ్మిది వేల స్కూళ్లలో ఒకే క్లాస్, ఒకే టీచర్ ఉన్నారన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. పవనన్న చెట్లు నాటాలని పిలుపునిచ్చారని, పిల్లలకు గ్రీన్ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. మొక్కనాటి మూడేళ్లు కాపాడే బాధ్యత వారిపై ఉంచుతామని అన్నారు.

Tags:    

Similar News