కృష్ణలంక వాసులకు కన్నీళ్లు మిగిల్చిన కృష్ణా వరదలు

కృష్ణా నది వరదలకు కృష్ణలంక వాసులకు కన్నీళ్లను మిగిల్చింది. రీటైనింగ్‌ వాల్‌ను నిర్మించారనే ఆనందం కూడా లేకుండా పోయింది. వరద ప్రమాదం నుంచి కాపాడ లేక పోయారు.

Update: 2024-09-05 09:43 GMT

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న కాళిదాస్‌ తన ఇద్దరు కుమారులతో కలిసి పరుగు పరుగున తన ఇంట్లో సామానులను పై ఫ్లోర్‌ ఉన్న ఇంటి యజమానుల ఇంట్లోకి చేర వేసుకుంటున్నారు. ఆలస్యం అయితే ఎంతో కష్టపడి సమకూర్చుకున్న సామానంతా వరద నీటిలో మునిగి పోతాయనే భయాందోళనలు అతని మైండ్‌ను కమ్మేశాయి. క్షణం ఆలస్యమైనా బియ్యం, మంచాలు, బెడ్లు, దుప్పట్లు, మంచాలు, దుస్తులు, ఫ్రెజ్, పుస్తకాలు, టీవీ ఇలా అన్ని మునిగి పోతాయనే ఆందళోనలు ఆయనను ఆవరించాయి. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకూడదనుకున్నారు. తన ఇద్దరు కుమారులు, నెయిబర్స్‌ సహాయంతో పై అంతస్తుకు చేరవేసుకునే సమంయలో వరద నీరు ఇంట్లోకి వచ్చేశాయి. నిముషాల్లోనే ఐదుగడుల వరకు నీరు కమ్మేసింది. టీవీ, ఫ్రెజ్, బియ్యం వంటి వస్తువులు తడిచి పోతాయోమోనని కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. కొన్ని నీటిలో మునిగి పోయినా ముఖ్యమైన వస్తువులను వరద నీటిలోనే పైకి మోసుకున్నారు. ఎంతో కష్టపడి వస్తువులు కూడబెట్టుకున్నానని, వరద నీటిలో మునిగి పోతే వీటిని తిరిగి సమకూర్చుకోవడం తనకు మించిన భారమని ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న కాళిదాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కాళిదాస్‌దే కాదు ఆ కాలనీలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లల్లో నివసించే వారి పరిస్థితి అంతా ఇదే రకంగా మారింది. కొందరు కొన్ని వస్తువులను మాత్రమే చేర వేసుకోగా, బీరువాలు, మంచాలు, ఫ్రెజ్‌లు వంటి వాటిని సేఫ్‌ చేసుకోలేక పోయారు.

ఇక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న శ్రీనివాస్‌ పరిస్థితి ఇంకా దారుణం. వరదల వల్ల కన్నీళ్లే మిగిలాయి. తన ఇంట్లోకి వరద నీటితో మునిపోయింది. ఆదివారం అర్థ రాత్రి ఒక్క సారిగా వరద నీరు వచ్చి చేరడంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లి పోయారు. ఏడు అడుగులకుపైగా వరద నీరు వచ్చి చేరింది. కట్టు బట్టలు కూడా మిగల లేదు. బియ్యం, ఉప్పు పప్పులు, మంచాలు, ప్రెజ్, టీవీ ఇలా ఒకటి కాదు చివరకు బైక్‌ కూడా వరదలో మునిగి పోయింది. వస్తువులు తడవకుండా పక్క ఇంట్లోకి మార్చుకుందామనుకున్నా ఆ అవకాశం లేకుండా పోయింది. కృష్ణా నది వరద కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్చ లేదు.
వరద నీరు ఎలా వచ్చిందంటే..
విజయవాడ నగరంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పోలీసు కాలనీ కూడా ఒకటి. విజయవాడ సిటీ కృష్ణలంక పరిధిలోని గీతానగర్‌ పోలీసు కాలనీని కృష్ణా నది వరద నీరు ముంచెత్తింది. ఈ కాలనీలో దాదాపు వెయ్యికిపై నివాస గృహాలు ఉంటాయి. ఈ కాలనీకి కూత వేటు దూరంలో కృష్ణా నది ఉంటుంది. ఇది వరకు 2009లో వచ్చిన వరదలకు ఇది ఎఫెక్ట్‌ అయింది. దీంతో పాటుగా యనమలకుదురు నుంచి ఆర్‌టీసీ బస్టాండ్‌ వరకు కృష్ణా నది తీరం వెంబడి ఉన్న కాలనీలన్నీ పూర్తి స్థాయిలో ముంపునకు గురయ్యాయి. వరద ముంపును నివారించేందుకు రీటైనింగ్‌ వాల్‌ను నిర్మించారు. అయితే పోలీసు కాలనీ ఏడో లైన వద్ద వాల్‌కు రంద్రం నుంచి ఫ్లడ్‌ వచ్చింది. డ్రైనేజీని నదిలోకి పంపేందుకు ఉపయోగించే ఈ రంద్రాన్ని క్లోజ్‌ చేయక పోవడం, ఒక్క సారిగా కృష్ణా నది ఔట్‌ ఫ్లో పెరగడం వల్ల పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరిందని స్థానిక నివాసి సునీల్‌ కుమార్‌ చెప్పారు. గీతానగర్‌ పోలీసు కాలనీతో పాటు భూపేష్‌ గుప్తానగర్, తారకరామ నగర్, రణధీర్‌నగర్, రాణిగారితోట, పూర్ణచంద్రనగర్, సత్యనారాయణ నగర్, రామలింగేశ్వర నగర్‌ వంటి అనేక కాలనీలు ఈ వరద ముంపునకు గురయ్యాయి.
ఆదివారం వరకు ఈ ప్రాంతాలకు ఎలాంటి వరద ముంపు ప్రమాదం లేదు. ఒక వైపు జోరుగా వర్షాలు కురుస్తున్నా, కృష్ణా నదికి వరద నీరు వచ్చి చేరుతున్నా ఇబ్బందులు తలెత్త లేదు. పోలీసు కాలనీలో ఉన్న రీటైనింగ్‌ వాల్‌ రంద్రాన్ని పూడ్చేందుకు మునిసిపల్‌ కార్పొరేష్‌ సిబ్బంది ప్రయత్నాలు ఫలించ లేదు. అదే రోజు సాయంత్రానికైనా రంద్రాన్ని పూడ్చుతారేమోనని కాలనీ వాసులంతా ఎదురు చూశారు. కానీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టక పోవడం, వరద రాదులే అన్న ఆలోచనల్లో అధికారులు ఉండడటంతో ఆదివారం సాయంత్రం నుంచి వరద నీరు వచ్చి చేరడం ప్రారంభమైంది. ఆదివారం ఆర్థ రాత్రి కల్లా ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరిపోయింది. సోమవారం ఉదయం ఏడు, ఎనిమిది గంటల కల్లా గ్రౌండ్‌ ఫ్లోర్‌లల్లోకి దాదాను నాలుగు అడుగుల వరకు వరద వచ్చి పడి పోయింది.
కాలనీని వరద ముంచెత్తడంతో కరెంట్‌ను కూడా కట్‌ చేశారు. దీంతో ఒక్క సారిగా చీకటి మయంగా మారింది. ఒక పక్క వరద నీరు, భరించ లేని వాసన, కరెంట్‌ లేక సతమతమైన కాలనీ వాసులను దోమలు దండయాత్రలకు ఉక్కిరి బిక్కిరయ్యారు. మంగళవారం ఉయయం 11 గంటల వరకు ప్రభుత్వం నుంచి అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు ఎవ్వరు రాలేదు. సహాయక దళాలు కూడా రాలేదు. దీంతో బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. పలకరించక పోయినా, ఆహారం అందించడం వంటి సహాయక చర్యలేమీ చేపట్టక పోయినా కనీసం మంచి నీరు అందించే దిక్కు లేకుండా పోయారని ఇదే కాలనీకి చెందిన అదే కాలనీకి చెందిన హర్షా ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వరద నీటిలోనే కాలనీ వాసులు మగ్గి పోయారు. తర్వాత మోటార్‌ పెట్టి నీటిని కృష్ణా నదిలోకి పంప్‌ చేయడంతో వరద నీరంతా తగ్గింది. వీధులు, ఇళ్లు మురుగు కంపుతో నిండి పోయింది. ఇప్పుడు ఇళ్లు శుభ్రం చేసుకోవడం స్థానికులకు సవాల్‌గా మారింది. మురుగు కంపును వదిలించుకునేందుకు ఫినాల్, డెటాల్, బ్లీచింగ్‌లతో నానా తంటాలు పడుతున్నారు. రీటైనింగ్‌ వాల్‌ కట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయిందని, వరద ముంపునకు గురికావలసి వస్తోందని ఇదే కాలనీకి చెందిన సురేష్‌ బాబు తెలిపారు.
Tags:    

Similar News