కొమ్మినేని నేడు రిలీజ్ అయ్యే అవకాశం
సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసి నాలుగు రోజులైనా సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇంకా విడుదల కాలేదు.;
సాక్షి టీవీ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి రిలీజ్ కాలేదు. సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చి నాలుగు రోజులైంది. బెయిల్ ఆదేశాలు శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు గుంటూరు కోర్టుకు అందాయి. ఆదేశాలు రాత్రి అందటంతో బెంచ్ దిగిన తరువాత జడ్జి ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు రెండో శనివారం కావడం, ఆ తరువాత రోజు ఆదివారం కావడంతో కోర్టుకు సెలవులు వచ్చాయి. సోమవారం సాయంత్రానికి బెయిల్ కాపీ జైలర్ కు అందే అవకాశం ఉందని కొమ్మినేని తరపు న్యాయవాదులు చెప్పారు. సోమవారం మధ్యహ్నాం వరకు జడ్డి బెయిల్ ఆదేశాలపై సంతకాలు చేయలేదు. అందువల్ల సాయంత్రానికి సంతకాలు పూర్తయి. పోలీసులకు అందే అవకాశం ఉంది. సాయంత్రం ఆరు గంటలోపు జైలు అధికారులకు బెయిల్ కాగితాలు అందితే విడుదల చేస్తారు. లేదంటే మంగళవారం విడుదలయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
అమరావతి ప్రాంతంలోని మహిళలు వేశ్యలని, అది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని చర్చలో పాల్గొన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యల నేపథ్యంలో యాంకర్ గా వ్యవహరించిన కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత నాలుగో రోజు కృష్ణంరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కృష్ణంరాజు రిమాండ్ లో ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చినా కోర్టుకు సెలవులు కావడంతో ఆయన విడుదల ఆలస్యమైంది.