చితికి పోతున్న ‘కిన్నెర జోగులు’, సంక్షేమానికి ఆమడ దూరం

లక్ష్మీ, హరిణి మృతికి కారణమెవ్వరు?;

Update: 2025-03-18 11:23 GMT
కిన్నెర కళాకారులు, అనంతపురం జిల్లా

అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అన్న ప్రచారం అంతా ఇంతా కాదు, దేశంలో ఏ మారుమూల కుగ్రామానికి వెళ్లినా ప్రతి పాఠశాల తరగతి మీద ఈ రాతలు కనపడుతుంటాయి. వాస్తవానికి అందరూ చదవగలుగుతున్నారా ? అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియెట్ పిల్లలు ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది విద్యార్థులు హల్ టికెట్స్ రాక ఇంటికి పరిమితమయ్యారు. తీవ్ర దుర్భర జీవనం గడుపుతున్న తల్లితండ్రులు అప్పు చేసి ఫీజులు కట్టి చదివిస్తున్నారు. డబ్బులు కట్టలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. చాలా మంది స్కూల్ డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నారు. 


 ఏమాత్రం రాజకీయ ప్రాతినిధ్యం లేని సంచార తెగ (Nomadic Tribe) లైన కిన్నెర జోగులు (Kinnera Jogulu), దొమ్మరోళ్లు (Dommari) గురించి పట్టించుకునేది ఎవరు? కిన్నెర జోగులు బిక్షాటన చేస్తూ జీవిస్తుంటారు. ఎక్కువగా అనంతపురం జిల్లా  కల్లూరు మండలం సమీపాన గుట్ట మీద,  గుట్ట కింద నివాసాలు ఏర్పరుచుకొని అసంఘటితంగా ఎదో ఒక పనిచేసుకొని బతుకులీడుస్తున్నారు.

గత శనివారం పొయ్యిలోకి పుల్లలు ఏరుకోవడానికి వెళ్లి లక్ష్మి అనే బాలిక నీటి మడుగులో పడి మరణించింది. లక్ష్మి ని కాపాడడానికి వెళ్లిన హరిణి కూడా మృత్యువాత పడింది. కల్లూరు లో 32 దాక కిన్నెర జోగుల కుటుంబాలు 2 దొమ్మరోళ్ల కుటుంబాలు ఉన్నాయి. అందులో 26 పైగా పిల్లలు కల్లూరు ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు. పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అని నినాదాలు గోడలకు పరిమితమవుతున్నాయి.

కిన్నెర ఒక సంగీత సాధనం. దానిని మీటుతు వారు స్థానికగాథలను, పురాణ గాథలను పాడుతూ సంచారం జీవితం గడుపుతూ ఉంటారు. వీళ్లు మహారాష్ట్ర నుంచి అనంతపురం జిల్లాకు వలస వచ్చారని చెబుతారు. కిన్నెర సాధనాలు చాలా రకాలు. కొన్ని వీణను పోలి ఉంటాయి. కొన్ని ఇంచుమించు గిటారు లాగ వుంటాయి. లోపల బోలుగా ఉండే సుమారు 20 అంగుళాల వెదురు పై మైనంతో మధ్యగా నాలుగు మెట్లను పెద్ద సొరకాయ బుర్రలను తికిస్తారు.  ఒక్కొక్క వాయిద్యానికి 7,,9 లేదా 12 లేదా 13 ఫ్రెట్స్ ఉంటాయి. రెండు లేదా మూడు సొరకాయ బూరలుంటాయి.

కిన్నెర

దాసరి, ఎరుకల, యానాది, సుగాలి, కొరవ, కొరచ, కైడై నక్కలా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని డినోటిఫైడ్ తెగలు (Denotified Tribes). ఇంకా, వడ్డెర, పాముల, నిర్షికారి, బుడబుక్కల, మందుల, పూసల, గంగి, రెడ్దుల, బోయ, దొమ్మర, జోగి సంచార పాక్షిక సంచార తెగలలో కొన్ని. సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం ప్రధాన అర్హత కలిగిన షెడ్యూల్ కులాల్లో ఇంకా అణగారిన, ఏమాత్రం గుర్తింపు లేని జంగమ దేవర, డక్కలి, కిన్నెర జోగులు, బేడ బుడగ జంగాల కులాలు నేడు కనుమరుగై పోతున్నాయి.

జంగమోళ్లు : వీరిని జంగం దేవర అని కూడ అంటారు. వీరు శివ భక్తులు. నొసటన వీభూతి ధరించి చేతిలో పెద్ద గంట పట్టుకొని వాయిస్తూ సంక్రాంతి ససందర్భంగా ఆ నెల అంతా తెల్ల వారు జామున వీదుల్లో తిరుగుతు శివ కీర్తనలు చేస్తూ, ఆ రోజు తిథి, వార, నక్షత్ర పలాలను తెలిపి తెల్లవారాక ప్రతి ఇంటికి వచ్చి సంభావన తీసుకునే వారు. అప్పటికే వీరు అంతిమ దిశలో వుండే వారు. వీరు అంతరించి చాల కాలమే అయింది. జంగం వారి జనాభా అతి తక్కువ. ముఖ్యంగా వీరు శివ భక్తులు. వీర భద్రుని ఆలయాల్లో పూజారులు వీరే వుంటారు.

గతంలో వీరు కొన్ని పల్లెలను తమలో తమకు కేటాయించుకొని ఆ పల్లెల్లో కార్తీక మాస నెలంతా తెల్లవారు జామున తిరిగుతూ గంట వాయిస్తూ, శివనామ స్తుతి చేస్తూ తిథి, వార, నక్షత్రాలను చెప్పి, తెల్లవారి ప్రతి ఇంటి ఆసామి వద్ద సంబావన పొందుతారు. ఇలా తిరిగే వారిని జంగం దేవర అని అంటారు. వీరు శుభాశుభాలు చెప్పుతారు. వీరికి సమాజంలో బ్రాహ్మణుల తరువాత గౌరవ స్థానం వీరిదే. వీరి వేష ధారణ కూడ గౌరవ ప్రదంగా వుంటుంది. కాషాయ వస్త్రాలు ధరించి, తలపాగా కట్టి, భుజాన కావడి లేదా జోలే, ఒక చేతిలో గంట, రెండో చేతిలో శంఖం ఉంటుంది. శివ స్తుతి చేస్తూ గంట వాయిస్తూ, మధ్య మధ్యలో శంఖాన్ని పూరిస్తారు. వీరిని పల్లె ప్రజలు శుభప్రదంగా భావించేవారు. వీరు కుల వృత్తి ఏనాడో మంటగలిసింది. ఎక్కడో కొందరు మిగిలిన వారు తమ పూర్వీకులు నేర్పిన విద్య భిక్షాటనకు ఉపయోగించుకుని జీవనం సాగిస్తున్నారు.

బేడ బుడగ జంగం: షెడ్యూల్డ్ కులాల జాబితాలో 9వ కులం బేడ బుడగ జంగం. బుడిగ, బేడ ఇలా రెండు రకాలుగా పిలువబడతారు. వీరు బుర్ర కథలు చెబుతారు. పగటివేషాలు . బిక్షాటన ఇవన్నీ వీరి కుల వృత్తులు. వీరికి సొంత భాష ఉంది.భారతదేశంలో దేశీయ భాషలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. సరైన నోటిఫైడ్ డీనోటిఫైడ్ కమ్యూనిటీల భాషలపై పరిశోధన ఇంకా నిర్వహించబడలేదు. అనేక దేశాల్లో రక్షణ కోసం అనేక నమూనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వర్గాలకు చెందిన భాషలు. భారతదేశం భాషాపరంగా ప్రసిద్ధి చెందింది సాంస్కృతిక వైవిధ్యం. అయితే అధికారిక గణాంకాలు లేవు.

ఆంధ్రప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ తెగలు, సంచార డీనోటిఫైడ్ తెగలు ప్రధానమైనవి వారు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. జటాపు, కొండ దొర, మూక దొర, మన్నె దొర, సవర, గదబ, చెంచు, కోయ, గొంది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆదిమ గిరిజన సమూహాలు ఉన్నాయి


Tags:    

Similar News