మదనపల్లె కేంద్రంగా కిడ్నీ రాకెట్.. తెలుగు రాష్ట్రాలకు విస్తరించిన నెట్ వర్క్

మహిళ మృతి, నగదు పంపకాల్లో తేడాలతో బయటపడిన తీరు ఇది.

Update: 2025-11-12 05:06 GMT

విశాఖపట్ణణానికి చెందిన యమునా కిడ్నీలు తొలగించడంతో మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోయింది. దళారుల మధ్య డబ్బు పంపకాల్లో తేడా వచ్చిది. ఆమె భర్తగా చెప్పుకున్న హరిబాబు డయల్ 112 నంబర్ కు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రశాంతత, చల్లదనానికి మారుపేరుగా నిలిచే మదనపల్లె పట్టణం ఉలిక్కిపడింది. సంచలనం రేకెత్తించే కిడ్నీ రాకెట్ బయటపడింది.

మదనపల్లె పట్టణ పోలీసులు రంగంలోకి దిగడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని అనేక పట్టణాలతో పాటు తెలంగాణ నుంచి కూడా పేదలను గుర్తించి, వారిని మదనపల్లెకు తీసుకుని రావడం ద్వారా కిడ్నీలు తొలగించి, వ్యాపారం చేస్తున్న వ్యవహారం వెలుగు చూసింది.
ఈ ఘటనపై మదనపల్లె టూ టౌన్ సీఐ రాజారెడ్డి, డీఎస్పీ మహేంద్రకు ఫోన్ చేసిన సమాధానం లేదు.
"వివరాలు పూర్తిగా తెలిసే వరకు ఏమి చెప్పలేం" అని పోలీస్ అధికారులు కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడడం లేదని అక్కడ జర్నలిస్టులు చెప్పారు. మరణించిన యమునా సంబంధీకులు మదనపల్లెకు వస్తున్నట్లు సమాచారం. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత అనేక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
చిత్తూరు జిల్లా ప్రస్తుతం (అన్నమయ్య జిల్లా)లోని మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో అక్రమంగా కిడ్నీలు తొలగించడానికి దళాలను ఏర్పాటు చేసుకున్న వ్యవహారం కూడా బట్టబయలైంది.
విశాఖపట్నం నుంచి యమునా నుంచి కిడ్నీలు తొలగించడం వల్ల చనిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నీ రాకెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్న బ్రోకర్లు పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్ తోపాటు యమున వెంట వచ్చిన హరిబాబును కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. మదనపల్లె పట్టణంలో గ్లోబల్ హాస్పిటల్ లో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఎన్ని రోజులుగా జరుగుతోందనే విషయంలో లోతుగా దర్యాప్తు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఆస్పత్రి ఎవరిది
మదనపల్లి పట్టణంలో గ్లోబల్ ఆసుపత్రికి మంచి గుర్తింపు ఉంది. ఈ ఆసుపత్రిని అన్నమయ్య జిల్లా డీసిహెచ్ఎస్ ( District Coordinator of District Hospital Services) డాక్టర్ ఆంజనేయులు ఏర్పాటు చేశార. ముంబైకి చెందిన ఆయన కోడలు డాక్టర్ సరస్వతి గ్లోబల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆమె మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ విభాగం ఇన్ చార్జిగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని పట్టణాల నుంచి పేదల అవసరాలు గుర్తించి, వారితో ఒ ధర మాట్టాడుకుని కిడ్నీలు ఇవ్వడానికి ఒప్పించడానికి కొందరు దళారులు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించార. దీనికోసం భారీగానే మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు దళారులకు నగదు ముట్టచెబితే, బాధితులకు మాత్రం తక్కువ మొత్తం చెల్లించి మిగతా సొమ్ము దళారులు నొక్కేస్తున్నట్లు కూడా తెలిసింది.
మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో సాగుతున్న కిడ్నీ రాకెట్ వెనక ఇదే పట్టణంలోని డయాలసిస్ కేంద్ర మేనేజర్ బాలు, పుంగనూరు డయాలసిస్ కేంద్రం మేనేజర్ వెంకటేష్ నాయక్ పాత్ర పై కూడా పోలీసులు దృష్టి సారించారు. పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో డాక్టర్ సరస్వతి కిడ్నీల మార్పిడికి అనుసరిస్తున్న పద్ధతుల వల్ల ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా అనే విషయంలో కూడా విచారణ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బ్రోకర్లు?
మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో డయాలసిస్ పేషెంట్లను గుర్తించడం, వారికి కిడ్నీలు మార్పిడి చేస్తామని నమ్మించినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. రోగులకు కిడ్నీలు మార్పిడి చేయాలంటే ఎవరో ఒకరు దానం చేయాలి.. దానికి ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి ఉండాలి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని గుర్తించడం, వారిని మదనపల్లికి తీసుకువచ్చే విధంగా ఆసుపత్రి నిర్వహకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రోకర్ ఏర్పాటు చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. కిడ్నీలు విక్రయించడానికి సిద్ధపడిన పేదలను ఒప్పించి మదనపల్లికి తీసుకురావడంలో దళారుల కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.
యమునా మృతితో..
మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో విశాఖపట్నం నుంచి తీసుకువచ్చిన యమునా అనే మహిళ నుంచి కిడ్నీలు తొలగించారు. ఆమెను ఇక్కడికి తీసుకు రావడానికి బ్రోకర్లుగా వ్యవహరించిన పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్ కీలకంగా వ్యవహరించినట్లు బయటపడింది. యమునను కలిసిన ఆ ముగ్గురు కిడ్నీ ఇస్తే సుమారు 8 లక్షల రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ఆమెను ఒప్పించారు. రెండు రోజుల కిందట ఆమెను మదనపల్లెకు తీసుకువచ్చారని సమాచారం. ఆమె వెంట వచ్చిన హరిబాబు భర్తగా పరియం చేసుకున్నట్లు తెలిసింది. యమున మరణించడం, ఆ తరువాత డబ్బు పంపిణీలో తేడాలు రావడంతో హరిబాబు తిరుపతి పోలీసులకు 112 నంబర్ కు డయల్ చేయడం, మదనపల్లె పోలీసులకు సమాచారం అందడంతో అసలు గుట్టు బయటపడింది.
మదనపల్లె పట్టణంలో గ్లోబల్ ఆసుపత్రి వద్ద ఉన్న యమున నుంచి అప్పటికే కిడ్నీ తొలగించారు. అస్వస్థతకు గురైన ఆమె ఆరోగ్యం విషమించి మృతి చెందింది. ఈ విషయాన్ని గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు బయటికి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. యమునా మృతదేహాన్ని తిరుపతి మీదుగా విశాఖపట్నం తరలించడానికి ఆసుపత్రి నిర్వాహకులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో హరిబాబు పోలీసులకు ఉప్పందించడంతో అసలు బండారు బయటపడింది.
మదనపల్లి పోలీసుల అప్రమత్తం..
తిరుపతి కమాన్ కంట్రోల్ నుంచి సమాచారం అందుకున్న మదనపల్లె రెండో పట్టణ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగం లోకి దిగిన పోలీసులు మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రిలో తనిఖీ చేసి అక్కడే ఉన్న మదనపల్లి డయాలసిస్ కేంద్ర మేనేజర్ బాలు, పుంగునూరు డయాలసిస్ కేంద్ర మేనేజర్ వెంకటేష్ నాయక్ ను అదురుపల్లి తీసుకున్నారు. వీరితోపాటు వైజాగ్ కు చెందిన ముగ్గురు బ్రోకర్లు సత్యా పద్మ వెంకటేశ్వర్లు కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రశాంతతకు, చల్లదనానికి మారుపేరుగా నిలిచే మదనపల్లి లో బయటపడిన కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం సృష్టించింది. దీనిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తున్నది అనే విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగారు. పట్టుబడిన దళారుల ద్వారా రాబట్టే సమాచారంతో కిడ్నీ రాకెట్ నెట్వర్క్ ఎన్ని ప్రాంతాలకు విస్తరించి ఉందనే విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News