వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య సంచలనం సృష్టించింది.

By :  Admin
Update: 2024-11-18 05:01 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మరో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత చిన్నాన్న హత్య కేసు మళ్లీ తెరపైకొచ్చించి. సంత్సరాల తరబడి స్తబ్దత నెలకొన్న ఆ కేసులో తాజాగా మరో అడుగు ముందుకు పడింది. కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దృష్టి సారించారు. పోలీసులు వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇంటికెళ్లారు. పులివెందుల డిఎస్పీ మురళీనాయక్‌ సమక్షంలో పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం రికార్డు చేశారు. 2022లో వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పైన పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేటు పిటీషన్‌ దాఖలు చేశారు. పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, రాజశేఖర్‌రెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్‌లపైన పోలీసులు నాడు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో భాగంగా పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో ఆయనను విచారించారు. హత్యకు గురైన వైఎస్‌ వివేకానందరెడ్డి ఏపీ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయడం తాజాగా ప్రాధాన్యత సంతరించుకుంది. పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఏ విషయాలను ప్రస్తావించి ఉంటారనే దానిపైన ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే గత వారంలో వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్‌ సునీత కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడుని కలిశారు. వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి తనపైన సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి వివరించడంతో పాటు వైఎస్‌ వివేకానందరెడ్డి కేసును కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. వివేకా హత్య కేసు పూర్వ పరాలను సునీత ఎస్సీ విద్యాసాగర్‌ నాయుడుకి వివరించారు. ఈ నేపథ్యంలో సోమవారం పీఏ రామకృష్ణారెడ్డి వాంగ్మూలం పోలీసులు రికార్డు చేయడం గమనార్హం.

Tags:    

Similar News