స్టార్ క్యాంపెయినర్ స్టారే బాలేదా ?

ఈ యాక్టులో అరెస్టయితే బెయిల్ దొరకటం అంత ఈజీకాదు. చట్టానికి ఆడ, మగ అన్న తేడా ఉండదు కదా.

Update: 2024-05-06 12:50 GMT

ఎవరిగురించైనా జనాలు మాట్లాడుకునేటపుడు వాడికేమిరా వాడి స్టార్ బ్రహ్మాండంగా ఉందని అనటం అందరు వినే వుంటారు. ఎవరైనా బ్రహ్మాండంగా వెలిగిపోతుంటే వాడి స్టార్ బాగుందని చెప్పుకోవటం కూడా తెలిసిందే. ఇపుడిదంతా ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ కల్వకుంట్ల కవిత గురించే. కవిత బెయిల్ పిటీషన్ను రౌస్ ఎవిన్యుకోర్టు తిరస్కరించింది. కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ యాక్టులో అరెస్టయితే బెయిల్ దొరకటం అంత ఈజీకాదు. చట్టానికి ఆడ, మగ అన్న తేడా ఉండదు కదా. దొరికితే అరెస్టు చేసి లోపలేసేయటమే. మిగిలిన విషయాలు కోర్టులో తేల్చుకోవాల్సిందే.

కవిత బెయిల్ పిటీషన్లను పదేపదే కోర్టు రెజెక్టు చేస్తోంది. తాజాగా రౌస్ ఎవిన్యు కోర్టు కవిత బెయిల్ పిటీషన్ను తిరస్కరించింది. బెయిల్ పిటీషన్ను రెజెక్టుచేయటంలో కోర్టు సరైన నిర్ణయమే తీసుకుందని అనిపిస్తోంది. ఎందుకంటే బెయిల్ కోరుతు కవిత అడిగిన కారణం మరీ అంత సిల్లీగా ఉంది. విషయం ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తున్న స్టార్ క్యాంపెయినర్లలో కవిత కూడా ఒకళ్ళు. ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న సమయంలోనే కవిత అరెస్టయ్యారు. దాదాపు రెండునెలలుగా ఢిల్లీలోని తీహార్ జైల్లోనే గడుపుతున్నారు. బెయిల్ పిటీసన్లో కవిత చెప్పిన కారణం ఏమిటంటే ఎన్నికల్లో తాను ప్రచారం చేయాలట. ప్రచారం ముగింపుకు వచ్చేస్తోంది కాబట్టి పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా తాను ప్రచారం చేయాలి కాబట్టి బెయిల్ ఇవ్వాలని అడిగారు.

ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాలో ప్రచారం చేయాలని బెయిల్ పిటీషన్ వేస్తే కోర్టు అంగీకరిస్తుందని కవిత ఎలాగ అనుకున్నారో అర్ధంకావటంలేదు. కవిత మరీ ఇంత అమాయకురాలా ? లేకపోతే అతితెలివి చూపిస్తున్నారా ? అన్నదే అర్ధంకావటంలేదు. ఎన్నికల్లో ప్రచారంచేయాలి కాబట్టి బెయిల్ కావాలని పిటీషన్ వేయమని చెప్పిన ఆమె సలహాదారులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇదివరకు కొడుకు పరీక్షలున్నాయి కాబట్టి బెయిల్ కావాలని బెయిల్ పిటీషన్ వేస్తేనే కోర్టు తిరస్కరించింది. కొడుకు పరీక్షలు, ఎన్నికల్లో ప్రచారం చేయాలని బెయిల్ పిటీషన్ వేయమని కోవితకు ఎవరు చెప్పారో అర్ధంకావటంలేదు.

బెయిల్ కావాలని అడిగేవారు ఏదైనా పెద్ద కారణం అంటే ఇంట్లో వాళ్ళకి సీరియస్ గా ఉందని బెయిల్ పిటీషన్లో చెబుతారు. ఇప్పటికే కవిత చాలాసార్లు బెయిల్ పిటీషన్లు వేయటం కోర్టు రెజెక్టు చేయటం అందరికీ తెలిసిందే. అసలు మనీల్యాండరింగ్ చట్టంలో అరెస్టయితే బెయిల్ అంత తొందరగా దొరకదన్న విషయాన్ని ఆమె లాయర్లు కవితకు చెప్పారా ? లేదా అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. ఈసారి బెయిల్ పిటీషన్ వేసేటపుడు ఏదైనా గట్టి కారణం చెప్పాలని ఆమె లాయర్లు చెబితే బాగుంటుంది. ఏదేమైనా కవిత పరిస్ధితి చూస్తుంటే స్టార్ క్యాంపెయినర్ స్టారే బాగున్నట్లు లేదని అర్ధమైపోతోంది.

Tags:    

Similar News